రకుల్ ప్రీత్ సింగ్( Rakul Preet Singh ) ఈ ప్రముఖ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తన అందంతో, నటనతో ప్రేక్షకుల నుంచి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది.
టాలీవుడ్ బడా హీరోల సరసం నటించి తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది.ఇక కేవలం సినిమాలో మాత్రమే కాకుండా వ్యాపారాలలో కూడా రాణిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది.
ఇది ఇలా ఉండగా.ఈ భామ బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో( Jackky Bhagnani ) ఫిబ్రవరి నెలలో వివాహం చేసుకున్నారు.
రకుల్ తన భర్తతో దిగిన ఫోటోలు వీడియోలకు సంబంధించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది.
అయితే, ఇటీవల ఉత్తర భారత దేశంలో బాగా ఫేమస్ అయిన పండుగ కర్వాచౌత్( Karva Chauth ) పండగ జరుపుకుంటున్న క్రమంలో.బెడ్ రెస్ట్ లో ఉన్న కూడా రకుల్ ప్రీత్ సింగ్ తన ఫస్ట్ కర్వాచౌత్ పండగను సెలబ్రేట్ చేసుకుంది.ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.
నిజానికి గత వారం రకుల్ సింగ్ కు వెన్నుకు గాయం అవ్వడంతో బెడ్ రెస్ట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే.ఇకపోతే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేస్తూ.
రకుల్ ప్రీత్ సింగ్ తన జాకీ భగ్నానీ ఇద్దరు రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని కర్వాచౌత్ పండుగను సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలను పంచుకుంది.ఇందుకు సంబంధించిన ఫోటోలను రకుల్ ప్రీత్ సింగ్ పోస్ట్ చేస్తూ.‘నా సూర్యుడు, చంద్రుడు, విశ్వం, నా ప్రతిదీ నువ్వే.మీకు మా నుండి కర్వా చౌత్ శుభాకాంక్షలు’ అంటూ తన భర్తను ట్యాగ్ చేసింది.
ప్రస్తుతం వీరిద్దరికి సంబందించిన ఫొటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ ఫోటోలను చూసిన అభిమానులు పెద్దెత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.మీరు ఎల్లపుడు ఇలాగే ఉండాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు.