ఇటీవల అమెరికా( America)లోని మాంట్‌క్లెయిర్ అనే చోట ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది.అక్కడ ఎఫీస్ గైరో అనే రెస్టారెంట్ ముందు ఒక అమెరికన్ మహిళ గ్రీస్ దేశపు జెండాలను చింపేసింది.
ఆమె చింపేసినవి ఇజ్రాయెల్ దేశపు జెండాలు అనుకుని, “ఫ్రీ పాలస్తీనా( Free Palestine)” అని నినాదాలు చేస్తూ చించివేసింది.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
టిక్‌టాక్‌లో ‘అంబమేలియా( Ambamelia )’ అనే పేరుతో ఫేమస్ అయిన ఆ మహిళ, ఒక రెస్టారెంట్ ముందు బ్లూ అండ్ వైట్ కలర్స్ జెండాలను చింపేస్తూ, “ఫ్రీ పాలస్తీన్! ఇక్కడ జనహత్య జరుగుతోంది.” అని అరిచింది, అంతేకాదు, రెస్టారెంట్‌లో పనిచేసే వ్యక్తిపై కోపం వ్యక్తం చేసింది.ఆమె”నేను మాంట్‌క్లెయిర్‌లో జయోనిజాన్ని సమర్థించను!” అని కూడా పేర్కొంది.ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ రెస్టారెంట్‌లో పనిచేసే వ్యక్తి ఆ జెండాలు గ్రీస్ దేశానికి సంబంధించినవని చెప్పగా, ఆ మహిళ ఆశ్చర్యపోయి, “ఏంటి? నిజంగానా? నేను అది ఇజ్రాయెల్ జెండా అనుకున్నాను – మై మిస్టేక్” అని చెప్పింది.
ఆమె ఈ సంఘటనను సోషల్ మీడియా( Social media)లో పోస్ట్ చేయగా, అది వైరల్ అయింది.రెస్టారెంట్ యజమాని ఎఫీ మిహాలిస్ ఈ సంఘటనను పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ సంఘటన జరిగిన సమయంలో ఇజ్రాయెల్, గజా పట్టీ మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి.అందుకే, ఆమె ఇజ్రాయెల్ జెండా అనుకుని దానిని చింపింది.ది లాన్సెట్ ప్రకారం, గాజా( Gaza )లో 2 లక్షల మంది మరణించారు.99,150 మంది గాయపడ్డారు.దాదాపు 10,000 మంది శిథిలాల కింద సమాధి అయ్యారని భావిస్తున్నారు.ఇజ్రాయెల్‌లో 346 మంది IDF సిబ్బంది, 66 మంది పోలీసు అధికారులు, సుమారు 800 మంది పౌరులతో సహా 1,200 మందికి పైగా మరణించారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నివేదించింది.