ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ( BRS party ) వచ్చే ఎన్నికల నాటికి మరింత బలం పెంచుకుని అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది.దీనిలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి, బీఆర్ఎస్ కు మరింత ఆదరణ పెంచుకునే ప్రయత్నం చేయాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తూ ఉండగా, పార్టీలోని కీలక నేతలు చాలా మంది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ, తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తూ ఉండడం కేసిఆర్ ఆగ్రహం కలిగిస్తోంది.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో అనేక కీలక పదవులు అనుభవించిన వారు ఇప్పుడు అధికారం కోల్పోవడంతో సైలెంట్ అయిపోయారు.తెలంగాణ పవన్ కు సైతం రావడం లేదు.
గతంలో ప్రతిరోజు వచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న వీరంతా ఇప్పుడు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తూ ఉండడం వెనుక కారణాలు ఏమిటనే విషయం పైన అధిష్టానం ఆరా తీస్తోంది.

బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు పెద్దపేట వేసింది.కార్పొరేషన్లలో యువతకు, యాక్టివ్ గా పనిచేసిన వారికి అవకాశం కల్పించింది.దాదాపు 80 మందికి పైగా కార్పొరేషన్ ల చైర్మన్ ల పదవులను అప్పగించింది.
వాళ్లందరూ పార్టీకి నిరంతరం అండగా ఉంటారని భావించింది .కానీ బీఆర్ఎస్ ఓటమి తరువాత కార్పొరేషన్ లకు చైర్మన్లుగా పనిచేసిన వారు ఇప్పుడు సైలెంట్ కావడం, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం వంటి వాటిపై కేసీఆర్ ఆరా తీస్తున్నారు. కేవలం కొంతమంది నాయకులు మాత్రమే మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిస్తూ విమర్శలు చేస్తున్నారు కానీ , మెజారిటీ నాయకులు మాత్రం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు .దీనికి కారణం ఏమిటి అనే విషయంపై బీఆర్ఎస్ అధిష్టానం ఆరా తీస్తోంది.నాయకులకు ఉన్న వ్యాపార, వ్యవహారాల కారణంగా తాము ప్రభుత్వాన్ని విమర్శిస్తే టార్గెట్ అవుతామని భావించి చాలామంది నేతలు సైలెంట్ గా ఉంటున్నారట.దీంతో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి పదవులు ఇవ్వాలనే డిమాండ్ బీఆర్ఎస్ లో మొదలైంది.

పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి ఎవరు అండగా ఉంటారో వారికే అవకాశాలు తర్వాత ఇవ్వాలని కోరుతున్నారు.గతంలో ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నాయకులకే కీలక పదవులు అప్పగించడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది అని, మొదటి నుంచి బీఆర్ఎస్ కోసం కష్టపడి పనిచేసిన నేతలను పక్కన పెట్టడం తోనే ఇప్పుడు ఆ ప్రభావం స్పష్టంగా కేసీఆర్ కు అర్థమవుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.