స్టూడెంట్స్‌కు యూకే యూనివర్సిటీ బంపరాఫర్.. సెలెక్టైతే రూ.11 లక్షలు మీవే..

బ్రిటన్‌లోని షెఫీల్డ్ యూనివర్సిటీ( University Of Sheffield ) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో( Artificial Intelligence ) మాస్టర్స్ డిగ్రీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది.మీరు కూడా కృత్రిమ మేధస్సు గురించి తెలుసుకోవాలని, దీనిపై లోతుగా అధ్యయనం చేయాలని ఆసక్తిగా ఉంటే, ఇది మీ కోసం గొప్ప అవకాశం.ఎందుకంటే ఈ కోర్సుకి సెలెక్టైతే రూ.11 లక్షల స్కాలర్‌షిప్‌ మీ సొంతమవుతుంది.ఈ కోర్సు సెప్టెంబర్ 2025 నుంచి ప్రారంభం కానుంది.ఈ కోర్సులో ఏఐ సిస్టమ్స్ నిర్మించడానికి పెద్ద మొత్తంలో డేటాను ఎలా విశ్లేషించాలో, వాటి నుంచి ఉపయోగకరమైన సమాచారాన్ని ఎలా తీయాలనేది నేర్చుకుంటారు.

 University Of Sheffield Invites International Students For Msc Artificial Intell-TeluguStop.com

కృత్రిమ మేధస్సు ఎలా పని చేస్తుందో, దాని వెనుక ఉన్న సిద్ధాంతాల గురించి లోతుగా అర్థం చేసుకుంటారు.

ఏఐ ప్రాజెక్టులను ఎలా చేయాలి, సమస్యలను ఎలా పరిష్కరించాలి అనే ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకుంటారు.

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 2025 మే 12, సోమవారం, మధ్యాహ్నం 1 గంట (బ్రిటిష్ సమయం).

Telugu Science, Analysis, Scholarship, International, Masters Degree, Mscartific

రోజూ వాడే స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియా, సెల్ఫ్-డ్రైవింగ్ కార్లు… ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తోనే పని చేస్తాయి.కంప్యూటర్లను( Computers ) మనిషిలాగా ఆలోచించేలా, నిర్ణయాలు తీసుకునేలా చేయడమే కృత్రిమ మేధస్సు పని.దీనితో డేటా అనాలసిస్( Data Analysis ) సులభతరం కూడా అవుతుంది.ఒక కొత్త ప్రొడక్ట్‌ను మార్కెట్‌లోకి తీసుకురావాలనుకుంటే, ఏ వయసు వాళ్ళకు, ఏ రకమైన వాళ్ళకు అది ఎక్కువగా నచ్చుతుంది అనేది ఈ డేటాను విశ్లేషించడం ద్వారా తెలుసుకోవచ్చు.

Telugu Science, Analysis, Scholarship, International, Masters Degree, Mscartific

కేవలం నంబర్లతో కూడిన డేటా మాత్రమే కాదు, వీడియోలు, ఫోటోలు, టెక్స్ట్ వంటి వివిధ రకాల డేటాను కూడా ఎలా విశ్లేషించాలో కూడా ఈ కోర్సులో నేర్చుకుంటారు.ఏఐ కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ వంటి అనేక రంగాల కలయిక.ఈ కోర్సులో ఈ అన్ని రంగాల గురించి ప్రాథమిక అవగాహన కూడా పొందుతారు.

మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ రంగాల్లో బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్లు, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్లు, ఇప్పటికే ఈ రంగంలో పని చేస్తున్న వాళ్లు తమ జాబ్‌లో మరింత ఎదగాలనుకొంటే ఈ కోర్సులో చేరవచ్చు.అందులో చేరాలనుకునే ఎవరైనా సరే మూడు లేదు నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీలో 60 శాతం మార్కులు తెచ్చుకొని ఉండాలి.

ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ తప్పనిసరి.ముఖ్యంగా IELTS స్కోరు 6.5 పైగా ఉండాలి.

షెఫీల్డ్ యూనివర్సిటీ అంతర్జాతీయ విద్యార్థుల కోసం 75 స్కాలర్‌షిప్‌లు ప్రకటించింది.

అంటే, ఈ కోర్సు చేయాలనుకునే 75 మంది విద్యార్థులకు ఫీజులో పాక్షిక రాయితీ లభిస్తుంది.ప్రతి స్కాలర్‌షిప్( Scholarship ) విలువ దాదాపు 10,000 పౌండ్లు (రూ.10.97 లక్షలు).షెఫీల్డ్ యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించి, అప్లై చేయవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube