క్రికెట్ ఆటంటే చాలా ఇది చిన్న పిల్లలకు ఇష్టముంటుంది.అలాంటి పిల్లలకి క్రికెట్ కిట్( Cricket Kit ) బహుమతిగా ఇస్తే వారి ఆనందానికి అవధులు లేకుండా పోతాయి.
అలాంటి బహుమతిని పొందినప్పుడు వారి ముఖంలో కనిపించే ఆనందం, ఉత్సాహం వర్ణణాతీతం.ఆ విధమైన ఆనందాన్ని ఓ పిల్లోడికి అందించారు తల్లిదండ్రులు.
బాలుడు పుట్టినరోజు( Birthday ) సందర్భంగా క్రికెట్ కిట్ గిఫ్ట్ గా( Gift ) ఇచ్చి అతని ఎంతో సంతోషపెట్టారు.
ఇటీవల సోషల్ మీడియాలో ఈ చిన్న పిల్లవాడి బర్త్‌డే వీడియో వైరల్ అయింది.
తన బర్త్‌డే కోరిక నెరవేరిన ఆనందంతో ఆ పిల్లవాడు ఎంతగా ఉల్లాసంగా ఉన్నాడో చూపించే వీడియో అది.తన కుటుంబ సభ్యులు అతనికి క్రికెట్ కిట్ ఇచ్చినప్పుడు ఆ పిల్లవాడు ఎంతగా ఆశ్చర్యపోయాడో, ఎంతగా ఆనందించాడో ఆ వీడియోలో చూడొచ్చు.అంతేకాదు, ఆ పిల్లవాడి ఆనందాన్ని చూసి ఎంతో మంది సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ఆ వీడియోలో, క్రికెట్ కిట్‌ను చాలా జాగ్రత్తగా ఒక వస్త్రంలో చుట్టి ఉంచినట్లు చూపిస్తారు.ఆ బహుమతిని విప్పినప్పుడు ఆ పిల్లవాడు ఎంతో ఉత్సాహంతో గెంతేసి, తన అక్కను గట్టిగా హత్తుకుని, తన ఆనందాన్ని అంతా వ్యక్తం చేశాడు.ఈ హార్ట్ టచింగ్ వీడియోను ఇప్పటికే 50 లక్షల కంటే ఎక్కువ మంది చూశారు.
ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వారు ఈ వీడియో చూసి ఎంతో ఆనందించి, ఆ పిల్లవాడి ఆనందాన్ని, అతని కుటుంబం చేసిన ఆ అందమైన పనిని ప్రశంసించారు.
“ఆ పిల్లవాడు క్రికెట్ కిట్‌ని ముట్టుకోకుండానే నేరుగా తన నాన్నని హగ్ చేసుకున్నాడు.అతను ఎంత కృతజ్ఞతతో ఉన్నాడో అది చూపిస్తుంది” అని ఒకరు కామెంట్ చేశారు.“నా బర్త్‌డే రోజు కూడా ఇలాంటి ఆనందం ఉండాలని నేను కోరుకుంటున్నాను.బాల్యం ఎంతో ప్రశాంతంగా ఉండేది” అని మరొకరు రాశారు.“ఆ పిల్లవాడు తన నాన్నని హగ్ చేసుకున్నప్పుడు నేను నిజంగా ఏడ్చేశాను” అని మరొకరు కామెంట్ చేశారు.