అల్లూరి సీతారామరాజు తర్వాత 13 ఫ్లాపులు.. సూపర్ స్టార్ కృష్ణ ఓల్డ్ కామెంట్స్ వైరల్!

సూపర్ స్టార్ కృష్ణ ( Superstar Krishna )తన సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.సూపర్ స్టార్ కృష్ణకు మాత్రమే సొంతమైన ఎన్నో రికార్డులు ఆయన అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించాయి.

 Super Star Krishna Old Comments Goes Viral In Social Media Details Inside Goes V-TeluguStop.com

ప్రయోగాలు చేసే విషయంలో సూపర్ స్టార్ కృష్ణకు ఎవరూ సాటిరారు.ఆయన తన సినీ కెరీర్ లో 300కు పైగా సినిమాలలో నటించి మెజారిటీ సినిమాలతో విజయాలను అందుకున్నారు.

కృష్ణ సినీ కెరీర్ లోని ప్రత్యేకమైన సినిమాలలో అల్లూరి సీతారామరాజు( Alluri Sitaramaraju ) ఒకటి కాగా ఈ సినిమా విశేషాల గురించి కృష్ణ ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు.గతంలో కృష్ణ చెప్పిన విషయాలు మళ్లీ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

అప్పట్లో అల్లూరి సీతారామరాజు అనేది ఒక సాహసం అని కృష్ణ కామెంట్లు చేశారు.నిర్మాత డీఎల్ నారాయణ ( Produced by DL Narayana )స్క్రిప్ట్ ఇచ్చి ఈ సినిమాలో నేను చేస్తే బాగుంటుందని చెప్పారని ఆయన పేర్కొన్నారు.

Telugu Ramachandra Rao, Krishna-Movie

అసాధ్యుడు సినిమాలో అల్లూరి గెటప్ వేసిన అనుభవం నాకు ఉందని నేను చేయగలనని చెప్పానని కృష్ణ తెలిపారు. రైటర్ మహారథి( Writer Maharathi ) నెల రోజుల్లో స్క్రిట్ సిద్ధం చేశారని ఆయన అన్నారు.సీనియర్ ఎన్టీఆర్ తో మీరు చేస్తానంటే నేను ఆగిపోతానని చెప్పానని ఆయన నుంచి జవాబు రాలేదని కృష్ణ చెప్పుకొచ్చారు.షూటింగ్ సమయంలో డైరెక్టర్ రామచంద్రరావు( Director Ramachandra Rao ) మరణించారని కృష్ణ అన్నారు.

Telugu Ramachandra Rao, Krishna-Movie

ఆ సినిమాకు ఘోస్ట్ డైరెక్టర్ అయ్యానని కృష్ణ చెప్పుకొచ్చారు.అల్లూరి సీతారామరాజు బ్లాక్ బస్టర్ రిజల్ట్ తర్వాత నా 13 సినిమాలు ఫ్లాప్ అయ్యాయని పాడిపంటలు సినిమాతో మళ్లీ భారీ సక్సెస్ దక్కిందని కృష్ణ వెల్లడించారు.కృష్ణ గతంలో చెప్పిన విషయాలను అభిమానులు మాత్రం ఇప్పటికీ గుర్తుంచుకున్నారు.కృష్ణ భౌతికంగా మృతి చెందినా తమ హృదయాల్లో జీవించి ఉన్నారని ఫ్యాన్స్ చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube