అల్లూరి సీతారామరాజు తర్వాత 13 ఫ్లాపులు.. సూపర్ స్టార్ కృష్ణ ఓల్డ్ కామెంట్స్ వైరల్!

సూపర్ స్టార్ కృష్ణ ( Superstar Krishna )తన సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

సూపర్ స్టార్ కృష్ణకు మాత్రమే సొంతమైన ఎన్నో రికార్డులు ఆయన అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించాయి.

ప్రయోగాలు చేసే విషయంలో సూపర్ స్టార్ కృష్ణకు ఎవరూ సాటిరారు.ఆయన తన సినీ కెరీర్ లో 300కు పైగా సినిమాలలో నటించి మెజారిటీ సినిమాలతో విజయాలను అందుకున్నారు.

కృష్ణ సినీ కెరీర్ లోని ప్రత్యేకమైన సినిమాలలో అల్లూరి సీతారామరాజు( Alluri Sitaramaraju ) ఒకటి కాగా ఈ సినిమా విశేషాల గురించి కృష్ణ ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు.

గతంలో కృష్ణ చెప్పిన విషయాలు మళ్లీ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

అప్పట్లో అల్లూరి సీతారామరాజు అనేది ఒక సాహసం అని కృష్ణ కామెంట్లు చేశారు.

నిర్మాత డీఎల్ నారాయణ ( Produced By DL Narayana )స్క్రిప్ట్ ఇచ్చి ఈ సినిమాలో నేను చేస్తే బాగుంటుందని చెప్పారని ఆయన పేర్కొన్నారు.

"""/" / అసాధ్యుడు సినిమాలో అల్లూరి గెటప్ వేసిన అనుభవం నాకు ఉందని నేను చేయగలనని చెప్పానని కృష్ణ తెలిపారు.

రైటర్ మహారథి( Writer Maharathi ) నెల రోజుల్లో స్క్రిట్ సిద్ధం చేశారని ఆయన అన్నారు.

సీనియర్ ఎన్టీఆర్ తో మీరు చేస్తానంటే నేను ఆగిపోతానని చెప్పానని ఆయన నుంచి జవాబు రాలేదని కృష్ణ చెప్పుకొచ్చారు.

షూటింగ్ సమయంలో డైరెక్టర్ రామచంద్రరావు( Director Ramachandra Rao ) మరణించారని కృష్ణ అన్నారు.

"""/" / ఆ సినిమాకు ఘోస్ట్ డైరెక్టర్ అయ్యానని కృష్ణ చెప్పుకొచ్చారు.అల్లూరి సీతారామరాజు బ్లాక్ బస్టర్ రిజల్ట్ తర్వాత నా 13 సినిమాలు ఫ్లాప్ అయ్యాయని పాడిపంటలు సినిమాతో మళ్లీ భారీ సక్సెస్ దక్కిందని కృష్ణ వెల్లడించారు.

కృష్ణ గతంలో చెప్పిన విషయాలను అభిమానులు మాత్రం ఇప్పటికీ గుర్తుంచుకున్నారు.కృష్ణ భౌతికంగా మృతి చెందినా తమ హృదయాల్లో జీవించి ఉన్నారని ఫ్యాన్స్ చెబుతున్నారు.

మహేష్ రాజమౌళి మూవీ టికెట్ రేటు 5000.. ఫ్యాన్స్ ఈ రేట్లకు సిద్ధం కావాల్సిందేనా?