చిన్నారి డాన్స్‭కు ఫిదా అయినా హీరోయిన్.. వీడియో వైరల్

నిత్యం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది.ఇందులో భాగంగా ప్రతిరోజు ఫన్ క్రియేట్ చేసే వీడియోలు, మరికొన్ని జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవడం గమనిస్తూనే ఉంటాము.

 Viral Video Young Girl Dance On Aayi Nai Song From Stree 2 Earns Praise From Shr-TeluguStop.com

అప్పుడప్పుడు చిన్న పిల్లలకు సంబంధించిన వీడియో లు కూడా వైరల్ గా మారడం చూసాం.పిల్లలు వారు మాట్లాడుతున్న పద్ధతులు, అలాగే వారు చేసే ఆటపాటలు, డాన్స్ సంబంధిత వీడియోలు మనం గమనించి ఉంటాం.

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక చిన్నారి వేసిన డాన్స్ శైలి అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ప్రస్తుతం వైరల్ గా మారిన వీడియోలో.ఒక చిన్నారి శ్రద్ధ కపూర్( Shraddha Kapoor ) కీలక పాత్ర పోషించిన ‘స్త్రీ 2 ‘( Stree 2 ) సినిమా నుంచి పాపులర్ సాంగ్ “ఆయ్ నై”( Aayi Nai Song ) కి డాన్స్ వేసి అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.వైరల్ అవుతున్న వీడియోలో చిన్నారి చేసిన డాన్స్ కి నెటిజన్స్ తో పాటు హీరోయిన్ శ్రద్ధా కపూర్ కూడా మెచ్చుకుంది.

ఆ పాటలో ఉన్న ప్రతి స్టెప్పు కూడా ఆ చిన్నారితో పాటు మరొక ఇద్దరు చిన్నారులు కూడా చాలా కరెక్ట్ గా, పర్ఫెక్ట్ గా వేసి అందరిని బాగా ఆకట్టుకున్నారు.వీరు డాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.

ఇక ఈ వీడియోకు నటి శ్రద్ధా కపూర్ స్పందిస్తూ.ఆ చిన్నారి కాన్ఫిడెన్స్ గురించి ప్రత్యేకంగా తెలియచేసింది.నెటిజన్స్ కూడా వివిధ రకాలుగా ఆ చిన్నారుల డాన్స్ వీడియోకు కామెంట్ చేస్తున్నారు.ఒక నెటిజన్ “ఆమె డ్యాన్స్ స్కిల్స్ నా కంటే మెరుగ్గా ఉన్నాయి” అని కామెంట్ చేయగా.

మరొక నెటిజన్ ” వీళ్ళలాగా డాన్స్ చేద్దాం అనుకుంటాము కానీ.కానీ చేయలేమని, కానీ ఈ అమ్మాయి డాన్స్ అదరగొట్టిందని” కామెంట్ చేసారు.ఇక శ్రద్ధ కపూర్ నటించిన స్త్రీ 2 సినిమాలో “ఆయ్ నై” ,“ఆజ్ కీ రాత్” పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సంగంతి తెలిసిందే.బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా రికార్డుల సునామి సృష్టించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube