నందమూరి తారక రామారావు నట వారసుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు బాలకృష్ణ.తండ్రి రెకమండేషన్ తో సినిమాల్లోకి వచ్చినా.
ఆ తర్వాత సొంత సత్తాతోనే సినిమా రంగంలో నిలదొక్కుకున్నాడు.ఎన్నో పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో అసమాన నటన కనబర్చి.
టాలీవుడ్ టాప్ హీరోగా కొనసాగాడు.ఇప్పటికీ అద్భుత సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు సైతం గట్టిపోటీ ఇస్తున్నాడు.
అటు ఎన్టీఆర్ కు మొత్తం 11 మంది పిల్లల.వీరిలో ఏడుగురు అబ్బాయిలు కాగా.నలుగురు అమ్మాయిలు.వీరందరిలో బాలకృష్ణ అంటే ఎన్టీఆర్ కు ప్రత్యేక అభిమానం.
తన నట, రాజకీయ జీవితాలకు వారసుడు బాలయ్య అని ఎన్నోసార్లు ప్రకటించాడు కూడా.బాలయ్య మీద ఎంతో ప్రేమ చూపించేవాడు.
అపురూపంగా చూసుకునే వాడు.ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగు పెట్టాకే బాలయ్య వివాహం జరిగింది.
ఓ వైపు ఎన్టీఆర్ పార్టీ పనుల్లో బిజీగా ఉంటే.బాలయ్య పెళ్లి చేయాలని బసవతారకం ఒత్తిడి పెట్టింది.
చివరకు బాలయ్యకు సంబంధాలు వెతకడం మొదలు పెట్టారు.అదే సమయంలో టీడీపీలో కీలక పదవిలో ఉన్న మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావుకు సమీప బంధువుల అమ్మాయితో పెళ్లి చేయాలి అనుకున్నారు.
అంతేకాదు.బాలయ్యకు అమ్మాయిని ఎంపిక చేసే బాధ్యతను కూడా ఎన్టీఆర్.
నాదెండ్లకే అప్పగించాడు.తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సంప్రదాయ కుటుంబపు అమ్మాయి వసుంధరను ఫిక్స్ చేశారు.
అప్పట్లో బాలయ్య వివాహం వసుంధరతో ఘనంగా జరిగింది.బాలయ్యకు వరకట్నం కింద వసుంధర ఫ్యామిలీ ఇచ్చిన మొత్తం కేవలం రూ.10 లక్షలు మాత్రమే.ఈ విషయాన్ని నాదెండ్ల ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించాడు.
బాలయ్య నిజానికి అప్పటికే టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు.అయినా తను కట్నం కోసం ఆరాట పడలేదు.
మంచి ఫ్యామిలీ సంబంధం దొరికితే చాలు అనుకున్నాడు.సంప్రదాయ పద్దతి అమ్మాయి భార్యగా రావాలి అనుకున్నాడు.
అనుకున్నట్లుగానే బాలయ్యకు మంచి అమ్మాయి దొరికింది.ఆ డబ్బుతోనే ఎన్టీఆర్ హైదరాబాద్ లో ఇల్లు కట్టినట్లు నాదెండ్ల చెప్పాడు.