దారుణం ఏపీ లో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న హైవే బ్రిడ్జ్ పిల్లర్ ..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా అనకాపల్లి ప్రాంతం జాతీయ రహదారి వద్ద నిర్మాణంలో ఉన్న హైవే దగ్గర ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.మేటర్ లోకి వెళ్తే నిర్మాణంలో ఉన్న హైవే వంతెన సైడ్ పిల్లర్ పక్కనే ఉన్న రహదారిపై వెళ్తున్న వాహనాలపై కుప్పకూలిపోయింది.

 Andhra Pradesh Highway Pillar Accident Anakapalli, Andhra Pradesh, Highway Pill-TeluguStop.com

జరిగిన ఈ దారుణమైన సంఘటన లో రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.  కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు.

  అక్కడికక్కడే మృతి చెందారు.బ్రిడ్జ్ పిల్లర్  భారీ శబ్ధంతో కూలిపోవడంతో.

స్థానికంగా ఉన్న ప్రజలు.భయాందోళనతో పరుగులు తీశారు.

ఇదే క్రమంలో రహదారిపై వెళ్తున్న వాహనదారులు.ఒక్క సారిగా ఉలిక్కి పడి ఎక్కడికక్కడ వాహనాలు ఆపేశారు.కూలిన వంతెన కింద రెండు మృతదేహాలు కారులో ఉండటంతో.అదే కారులో ప్రయాణిస్తూ సురక్షితంగా బయటపడ్డ మిగతావాళ్ళు.

వాళ్ల మృతదేహాలు చూసి కన్నీరుమున్నీరవుతున్నారు.ఇదే క్రమంలో కూలిన వంతెన కింద మిగతా వారు ఎవరైనా ఉన్నారేమో అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే జరిగిన సంఘటన తెలుసుకున్న వెంటనే హైవే ప్రాంతానికి చెందిన అధికారులు అదే రీతిలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.  కేసు నమోదు చేసి సహాయక చర్యలు చేపట్టారు.

 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube