బిగ్‌‌బాస్-8: వరస్ట్ కంటెస్టెంట్ ఎలిమినేటెడ్.. సంబరాలు చేసుకుంటున్న ప్రేక్షకులు..?

బిగ్‌బాస్ సీజన్ 8లో( Bigg Boss Season 8 ) ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లలో కొందరు పిచ్చి పట్టిన మెంటల్ పేషెంట్లలాగా ప్రవర్తిస్తూ ప్రేక్షకులకు షాకిచ్చారు.మణికంఠ( Manikantha ) మహిళా కంటెస్టెంట్లను కౌగిలించుకొని వారికి ఇబ్బంది కలిగించాడు.

 Bigg Boss 8 Telugu Latest Eviction Details, Bigg Boss 8 Telugu, Bigg Boss 8 Telu-TeluguStop.com

ఇక పృథ్వి శెట్టి( Prithvi Shetty ) గురించి చెప్పాల్సిన అవసరం లేదు.ఈయన బిగ్‌బాస్ హౌజులో అకారణంగానే ఒక ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నాడు.

అవినాష్, ఇతర కంటెస్టెంట్లను “అరేయ్, ఏరా, నా ఇష్టం రా “అని పిలుస్తూ కోపం తెప్పించాడు.ఇప్పుడు ఈ వరస్ట్ కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఈవారం ఆయనే ఎలిమినేట్ అయిపోయినట్టు టీవీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఆయన వెళ్లిపోయినట్లు వార్తలు లీకయ్యాక మిగతా హౌజ్‌మేట్లు, ప్రేక్షకులు సంబరాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది.

వాళ్లందరూ ఊపిరి పీల్చుకునేలా చేసిన బిగ్‌‌బాస్ టీమ్‌కు థాంక్స్ కూడా చెబుతున్నారు.ఈ పని ముందే చేసినట్లయితే ఇంకా బాగుండేది.

హౌజులోకి అతన్ని తీసుకురావడమే పెద్ద తప్పు.సిగరెట్లు తాగడం, లేడీ కంటెస్టెంట్లతో పులిహోర కలపడం తప్ప ఇతను ఇప్పటిదాకా చేసిందేమీ లేదు.

గేమ్స్, టాస్కుల్లో ఓ ఉన్మాదిలా అరవడం అతనికి అలవాటు.పైపైకి దూసుకొస్తూ అరాచకం సృష్టిస్తుంటాడు.

మొదట్లో అందరూ మణికంఠను మెంటల్ కేసు అని అనుకుంటే అతనికి తాత లాగా తయారయ్యాడు పృథ్వి.

Telugu Avinash, Bigg Boss, Bigg Boss Show, Hariteja, Manikanta, Nagarjuna, Prera

పృథ్వి రూడ్‌గా మాట్లాడటమే కాదు దర్టీ కామెంట్స్ కూడా చేసి చాలామంది చేత చివాట్లు తిన్నాడు.ఒకానొక సందర్భంలో అవినాష్‌ను( Avinash ) ఉద్దేశించి… ‘‘నీ భార్యని హౌస్‌లోకి పంపించవచ్చు కదా’’ అని ఓ వరస్ట్ కామెంట్ పాస్ చేశాడు.అతనికి తెలుగు సరిగా రాదని కొంతమంది సమర్థిస్తున్నారు కానీ అతను మాత్రం కావాలనే ఉద్దేశపూర్వకంగా ఇలాంటి చెత్త కామెంట్లు పాస్ చేస్తూ చిరాకెత్తించాడు.

అందుకే మెజారిటీ ఆడియన్స్ పాజిటివ్‌గా తీసుకోలేకపోయారు.ప్రేరణను( Prerana ) కూడా పిచ్చిగా టార్గెట్ చేసి కోపం తెప్పించాడు.ఈయనకు సరిగా మాట్లాడటం రాదు.ఆ జుట్టు, ఆ గడ్డం పెంచుకొని ఆదిమానవుడి లాగా, మర్యాద తెలియని మనిషిలాగా ప్రవర్తించాడు.

Telugu Avinash, Bigg Boss, Bigg Boss Show, Hariteja, Manikanta, Nagarjuna, Prera

నిజానికి బిగ్‌బాస్‌ ఇన్నిరోజులూ ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ అవుతుందని పృథ్విని ఉంచుతూ వచ్చాడు.ఈవారం కూడా పృథ్వికి వోట్లు బాగానే వచ్చాయని తెలుస్తోంది.అతనికన్నా హరితేజ, టేస్టీ తేజ వోటింగులో వెనుకబడి ఉన్నట్లుగా సమాచారం.వీళ్లలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉండగా అలా చేసే అవకాశం లేకుండా పోయింది.ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా వచ్చినప్పుడే వాళ్లతో మూణ్నాలుగు వారాల మినిమం ఉండేలాగా ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నారట.వారం, పది రోజులకే వారిని పంపియడం బాగుండదు కాబట్టి బిగ్‌బాస్‌ కూడా వారి ఎలిమినేషన్ ను ఆపుతున్నట్లుగా తెలుస్తోంది.

ఆ ఇద్దరినీ పంపించలేడు.పైగా, పృథ్వి లిమిట్స్ బాగా దాటేస్తున్నాడు.

కాబట్టి అతడిని బలి చేసినట్లుగా తెలుస్తోంది.

ఇకపోతే ఉడిపికి చెందిన పృథ్వి ఓ బుల్లితెర సీరియల్ యాక్టర్. నిజానికి ఇతన్ని తీసుకోవాలని బిగ్‌బాస్‌ టీమ్ అనుకోలేదు కానీ లాస్ట్ మినిట్ లో ఎవరో వేరే కంటెస్టెంటు జబ్బుపడటంతో ఈ పృథ్విని హడావుడిగా ఎంపిక చేసుకున్నారు.50 రోజులు తనను అతను ఉన్నాడు కానీ ఆ అన్ని రోజులు కూడా చిరాకు పుట్టించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube