పురాణాలను మోడర్న్‌గా చూపించగల ఏకైక డైరెక్టర్ బాపు.. ఆ సినిమాతో ప్రూవ్ అయ్యిందిగా..?

బాపు( Director Bapu ) ఎన్నో అద్భుతమైన మాస్, క్లాసిక్ సినిమాలు తీసి గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు.“మన వూరి పాండవులు”( Manavoori Pandavulu Movie ) టైటిల్ తో ఆయన తీసిన సినిమా కూడా సూపర్ హిట్ అయింది.ఈ సినిమాలో పురాణాలను చాలా మోడర్న్‌గా, సామాన్య ప్రజలందరికీ అర్థమయ్యేలాగా తీశారు.మహాభారతంలో( Mahabharatam ) పంచ పాండవుల్లాగా ఈ సినిమాలో కూడా ఐదుగురు పాండవులు, ఒక దుర్యోధనడు, ఒక దుశ్శాసనుడు, ఒక శకుని ఉంటారు.

 Director Bapu Is The Only Director Who Can Show History As Social Movie Details,-TeluguStop.com

అయితే ఇందులో దుర్యోధనుడు, దుశ్శాసనుడిని బ్రదర్స్ లాగా చూపించారు.భారతంలోలాగా ద్రౌపది ఈ సినిమాలో కనిపించదు కానీ మోసానికి గురై అవమానాలను అనుభవించిన మహిళ కనిపిస్తుంది.ఆ పాత్రను శోభ పోషించింది.పల్లెటూరి యువతిగా, దొరగారి చేతిలో మోసపోయిన యువతి పాత్రలో ఒదిగిపోయింది.

Telugu Bapu, Bhanuchander, Chiranjeevi, Geetha, Krishnam Raju, Mahabharatam, Myt

అందరికీ చాలా బాగా అర్థమైన “మన ఊరి పాండవులు” సినిమా 1978లో విడుదలైంది.ఇది పడువారళ్ళి పాండవురు అనే కన్నడ సినిమాకు రీమేక్.ఒరిజినల్ సినిమాలో అంబరీష్, రామకృష్ణ, ఆరతి వంటి నటీనటులు ప్రధాన పాత్రలు పోషించారు.అనంతరం బాపు ఈ సినిమాని “హం పాంచ్ అనే” టైటిల్‌తో హిందీలో రీమేక్ చేశారు.

అందులో సంజీవ్ కుమార్, మిధున్ చక్రవర్తి యాక్ట్ చేశారు.తమిళంలో కూడా దీన్ని తీశారు.

తెలుగు సినిమాలో నటించిన కృష్ణంరాజుకు( Krishnam Raju ) ఉత్తమ నటుడిగా రాష్ట్రపతి అవార్డు లభించింది.నిర్మాతలకు ఫిలింఫేర్ అవార్డ్స్ వచ్చాయి.

బాలూ మహేంద్రకు బెస్ట్ సినిమాటోగ్రాఫర్‌గా నంది అవార్డు అందుకున్నారు.ఈ సినిమాతో మంచి ప్రాఫిట్స్ కూడా వచ్చాయి.

Telugu Bapu, Bhanuchander, Chiranjeevi, Geetha, Krishnam Raju, Mahabharatam, Myt

ప్రముఖ యాక్టర్స్ గీత, భానుచందర్‌ ఈ మూవీ తోనే పరిచయమయ్యారు.ఇది చిరంజీవికి( Chiranjeevi ) సెకండ్ మూవీ కావడం విశేషం.ఇందులో చిరు దుర్యోధనుడికి మేనల్లుడిగా, మేనమామను ప్రతిఘటించే అగ్రెసివ్ యంగ్‌స్టర్‌గా నటించి ప్రశంసలు అందుకున్నాడు.ఈ సినిమా తూర్పు గోదావరి జిల్లాలోని కోరుకొండకు సమీపంలో ఉన్న దోసకాయలపల్లి ఊరిలో షూట్ చేశారు.

సినిమా స్టోరీకి ఈ లొకేషన్ బాగా సెట్ అయింది.

కె.

వి మహదేవన్ కంపోజ్ చేసిన సాంగ్స్ చాలా బాగుంటాయి.కొన్ని ఎవర్‌గ్రీన్ హిట్టయ్యాయి.“పాండవులు పాండవులు తుమ్మెదా మన ఊరి పాండవులు తుమ్మెదా” పాట ఇప్పటికీ చాలాచోట్ల వినిపిస్తుంటుంది.ఈ సినిమా టీవీలో వస్తుంటుంది.

బాపు పురాణాలను ఎంత చక్కగా సోషలైజ్ చేశారో చూడాలంటే ఈ మూవీ ఒక్కసారైనా తప్పక చూడాల్సిందే.ఇది కొద్దిగా రామ్ చరణ్ తీసిన “రంగస్థలం” సినిమా లాగానే ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube