అసలే ప్రస్తుతం సమ్మర్ సీజన్ రన్ అవుతోంది.ఈ సీజన్‌లో ఆరోగ్యం పట్ల ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా అనేక అనారోగ్య సమస్యలు చుట్టేస్తుంటాయి.
అందులోనూ పిల్లల విషయంలో మరింత కేర్ తీసుకోవాలి.లేదంటే రోగాల బారిన పడే అవకాశాలు పెరుగుతాయి.
అయితే కొందరు పిల్లలు ఏం పెట్టినా తినడానికి తెగ మారాం చేస్తుంటారు.ఈ క్రమంలోనే వారు రోజురోజుకు వీక్‌గా తయారవుతుంటారు.
వేటిపైనా శ్రద్ధ వహించలేకపోతుంటారు.దాంతో తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థంగాక పిల్లలను హాస్పట్స్ చుట్టూ తిప్పుతుంటారు.
ఈ లిస్ట్‌లో మీ పిల్లలు ఉన్నారా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే సూపర్ హెల్తీ అండ్ టేస్టీ స్మూతీని పిల్లలకు ఇస్తే లొట్టలేసుకుని తాగడమే కాదు.వారి ఆరోగ్యానికి ఉపయోగపడే ప్రయోజనాలెన్నో లభిస్తాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీ ఏంటో.దాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక యాపిల్‌ను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల రోల్డ్ ఓట్స్, కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు, మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు, రెండు టేబుల్ స్పూన్ల పీనట్ బటర్, హాఫ్ కప్ ఫ్యాట్ లెస్ మిల్క్ మరియు వన్ గ్లాస్ వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి.

బాగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని గ్లాస్‌లోకి తీసుకుని అందులో సన్నగా తరిగిన యాపిల్ ముక్కలను కొన్నిటిని వేస్తే పీనట్ యాపిల్ అండ్ ఓట్స్ స్మూతీ సిద్ధం అవుతుంది.అద్భుతమైన టేస్ట్‌ను కలిగి ఉండే ఈ స్మూతీని రోజుకు ఒకసారి పిల్లల చేత తాగిస్తే.ఎంత వీక్‌గా ఉన్నా వారు యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా మారతారు.నీరసం, అలసట వారి దరి చేరకుండా ఉంటాయి.వారి ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది.మరియు ఎముకలు, కండరాలు దృఢంగా కూడా మారతాయి.