పురాణాలను మోడర్న్‌గా చూపించగల ఏకైక డైరెక్టర్ బాపు.. ఆ సినిమాతో ప్రూవ్ అయ్యిందిగా..?

బాపు( Director Bapu ) ఎన్నో అద్భుతమైన మాస్, క్లాసిక్ సినిమాలు తీసి గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు.

"మన వూరి పాండవులు"( Manavoori Pandavulu Movie ) టైటిల్ తో ఆయన తీసిన సినిమా కూడా సూపర్ హిట్ అయింది.

ఈ సినిమాలో పురాణాలను చాలా మోడర్న్‌గా, సామాన్య ప్రజలందరికీ అర్థమయ్యేలాగా తీశారు.మహాభారతంలో( Mahabharatam ) పంచ పాండవుల్లాగా ఈ సినిమాలో కూడా ఐదుగురు పాండవులు, ఒక దుర్యోధనడు, ఒక దుశ్శాసనుడు, ఒక శకుని ఉంటారు.

అయితే ఇందులో దుర్యోధనుడు, దుశ్శాసనుడిని బ్రదర్స్ లాగా చూపించారు.భారతంలోలాగా ద్రౌపది ఈ సినిమాలో కనిపించదు కానీ మోసానికి గురై అవమానాలను అనుభవించిన మహిళ కనిపిస్తుంది.

ఆ పాత్రను శోభ పోషించింది.పల్లెటూరి యువతిగా, దొరగారి చేతిలో మోసపోయిన యువతి పాత్రలో ఒదిగిపోయింది.

"""/" / అందరికీ చాలా బాగా అర్థమైన "మన ఊరి పాండవులు" సినిమా 1978లో విడుదలైంది.

ఇది పడువారళ్ళి పాండవురు అనే కన్నడ సినిమాకు రీమేక్.ఒరిజినల్ సినిమాలో అంబరీష్, రామకృష్ణ, ఆరతి వంటి నటీనటులు ప్రధాన పాత్రలు పోషించారు.

అనంతరం బాపు ఈ సినిమాని "హం పాంచ్ అనే" టైటిల్‌తో హిందీలో రీమేక్ చేశారు.

అందులో సంజీవ్ కుమార్, మిధున్ చక్రవర్తి యాక్ట్ చేశారు.తమిళంలో కూడా దీన్ని తీశారు.

తెలుగు సినిమాలో నటించిన కృష్ణంరాజుకు( Krishnam Raju ) ఉత్తమ నటుడిగా రాష్ట్రపతి అవార్డు లభించింది.

నిర్మాతలకు ఫిలింఫేర్ అవార్డ్స్ వచ్చాయి.బాలూ మహేంద్రకు బెస్ట్ సినిమాటోగ్రాఫర్‌గా నంది అవార్డు అందుకున్నారు.

ఈ సినిమాతో మంచి ప్రాఫిట్స్ కూడా వచ్చాయి. """/" / ప్రముఖ యాక్టర్స్ గీత, భానుచందర్‌ ఈ మూవీ తోనే పరిచయమయ్యారు.

ఇది చిరంజీవికి( Chiranjeevi ) సెకండ్ మూవీ కావడం విశేషం.ఇందులో చిరు దుర్యోధనుడికి మేనల్లుడిగా, మేనమామను ప్రతిఘటించే అగ్రెసివ్ యంగ్‌స్టర్‌గా నటించి ప్రశంసలు అందుకున్నాడు.

ఈ సినిమా తూర్పు గోదావరి జిల్లాలోని కోరుకొండకు సమీపంలో ఉన్న దోసకాయలపల్లి ఊరిలో షూట్ చేశారు.

సినిమా స్టోరీకి ఈ లొకేషన్ బాగా సెట్ అయింది.కె.

వి మహదేవన్ కంపోజ్ చేసిన సాంగ్స్ చాలా బాగుంటాయి.కొన్ని ఎవర్‌గ్రీన్ హిట్టయ్యాయి.

"పాండవులు పాండవులు తుమ్మెదా మన ఊరి పాండవులు తుమ్మెదా" పాట ఇప్పటికీ చాలాచోట్ల వినిపిస్తుంటుంది.

ఈ సినిమా టీవీలో వస్తుంటుంది.బాపు పురాణాలను ఎంత చక్కగా సోషలైజ్ చేశారో చూడాలంటే ఈ మూవీ ఒక్కసారైనా తప్పక చూడాల్సిందే.

ఇది కొద్దిగా రామ్ చరణ్ తీసిన "రంగస్థలం" సినిమా లాగానే ఉంటుంది.

నా అఛీవ్ మెంట్ పవన్ కళ్యాణ్ రామ్ చరణ్.. చిరంజీవి షాకింగ్ కామెంట్స్ వైరల్!