మొటిమలను మాయం చేసే ఆవనూనె.. ఎలా వాడాలో తెలుసా?

యుక్త వయసు ప్రారంభం అయినప్పటి నుంచి యువతి యువకులను మొటిమలు ( Acne ) ప్రధానంగా వేధిస్తూ ఉంటాయి.హార్మోన్ల మార్పులు, జిడ్డుగల కాస్మెటిక్ మరియు జుట్టు ఉత్పత్తుల‌ను వినియోగించ‌డం, చర్మాన్ని ఎక్కువగా తాకడం, మొబైల్ లో గంట‌లు త‌ర‌బ‌డి మాట్లాడ‌టం, కొన్ని ర‌కాల మందుల వాడ‌కం, అధిక చెమ‌ట, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవ‌డం, ఎయిర్ పొల్యూష‌న్ త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల ముఖంపై మొటిమ‌లు ఏర్ప‌డుతుంటాయి.

 How To Get Rid Of Acne With Mustard Oil Details, Mustard Oil, Mustard Oil Benef-TeluguStop.com

మొటిమ‌లు చ‌ర్మంలో మెరుపును దూరం చేస్తాయి.ముఖాన్ని అంద‌విహీనంగా చూపిస్తాయి.

మొటిమల కారణంగా అమ్మాయిలు అబ్బాయిలు తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు.మొటిమలను వదిలించుకునేందుకు రకరకాల క్రీములు వాడుతుంటారు.కానీ కొందరిలో ఎన్ని క్రీములు వాడిన కూడా మొటిమలు మాత్రం అంత తొందరగా తగ్గవు.అయితే కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు మార్కెట్ లో ల‌భ్య‌మ‌య్యే క్రీములు కన్నా చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తాయి.

ముఖ్యంగా ఆవ నూనె( Mustard Oil ) మొటిమలు తగ్గించడానికి అద్భుతంగా తోడ్పడుతుంది.

Telugu Acne, Acne Skin, Tips, Skin, Latest, Mud Oil, Neem Powder, Skin Care, Ski

అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆవ నూనె వేసుకొని స్లైట్ గా వేడి చేయాలి.గోరువెచ్చగా ఉన్న ఆవ నూనెలో పావు టేబుల్ స్పూన్ పసుపు( Turmeric ) మరియు పావు టేబుల్ స్పూన్ నీమ్ పౌడ‌ర్‌( Neem Powder ) వేసుకొని మూడు కలిసేలా బాగా మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నైట్ నిద్రించే ముందు మొటిమలు మరియు మచ్చలపై అప్లై చేసుకుని ఆరబెట్టుకోవాలి.

Telugu Acne, Acne Skin, Tips, Skin, Latest, Mud Oil, Neem Powder, Skin Care, Ski

పూర్తిగా ఆరిన తర్వాత నిద్రించాలి.ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.నిత్యం నైట్ ఇలా చేశారంటే ఎంతటి మొండి మొటిమలు అయినా సరే దెబ్బకు పరారవుతాయి.అలాగే చర్మంపై మచ్చలు ఉన్న క్రమంగా మాయం అవుతాయి.కాబట్టి మొటిమలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఆవ నూనెతో ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube