మన భారతీయులు సాంప్రదాయా( Indian traditional )లకు ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటారు.సాంప్రదాయాలకు కట్టుబడి నడుచుకోవడం అనేది ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తుంది.
భారత్ లోని ప్రజలు సమయ సందర్భాలను బట్టి కొన్ని పనులను చేసుకుంటూ ఉంటారు.అలాంటి సమయంలో రాత్రిపూట గొర్లను కత్తిరించుకోకూడదు అనేది కూడా ఒక అంశం.
చీకటి పడగానే ప్రతి ఇంట్లో లైట్లను ఆన్ చేసుకుంటారు.ఇలా లైట్స్ ఆన్ చేసిన తర్వాత చేతి గోర్లను ఎలాంటి పరిస్థితుల్లో కూడా కట్ చేసుకోకూడదని మన పెద్దలు హెచ్చరిస్తూ ఉంటారు.
పొరపాటున ఎవరైనా ఆ విధంగా ఆ సమయంలో కత్తిరిస్తే మంచిది కాదని మందలిస్తారు కూడా.సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి( Goddess Lakshmi ) ఇంటికి వస్తుంది.
కాబట్టి అలాంటి సమయంలో చేతి గోళ్లు కత్తిరిస్తే ఆశుభమని చెబుతుంటారు.

అయితే దీన్ని కొందరు మూఢనమ్మకం గానే భావిస్తారు.వాస్తవానికి మన పెద్దలు చెప్పే ప్రతి విషయాన్ని ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది.అయితే అలా సాయంత్రం గాని రాత్రి కానీ వేళ్ళ గోళ్లను కత్తిరించడం అనేది భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో చాలామంది ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు.
ఇలా కత్తిరిస్తే దయ్యాలు వస్తాయని పెద్దలు చెబుతారు.వాస్తవానికి ఈ నమ్మకాల వెనుక ఒక బలమైన శాస్త్రీయ కారణం ఉంది.అయితే పూర్వకాలంలో కరెంట్ ఉండేది కాదు. ఇళ్లలో కరెంటు లేని కారణంగా ట్యూబ్లైట్లు, లైట్స్ ఉండేవి కావు.
అలాంటి సమయంలో సాయంత్రం సమయంలో చిమ్నీలు, బుడ్డి దీపాలు మాత్రమే వాడేవారు.

ఆ సమయంలో గోళ్లు కత్తిరించుకోకునేందుకు నైల్ కట్టర్స్ ( Nail Cutters )కూడా ఉండేవి కావు.ఆ సమయంలో గోర్లను కత్తిరించుకోవాలంటే కత్తి లేదా బ్లేడ్ ఉపయోగించాల్సి వచ్చేది.అలా సూర్యాస్తమయం తర్వాత చీకటిలో పదునైన వస్తువులను ఉపయోగిస్తే వేళ్ళు కట్ అయ్యే ప్రమాదం ఉందని రాత్రి సమయంలో గోర్లను కత్తిరించుకోకూడదని చెబుతూ ఉంటారు.
అయితే చాలామంది ఇది పట్టించుకోరు.అలా వినకపోవడంతోనే దేవుడు లేదా దయ్యం పేరు చెప్పి వారిని గోర్లు తీసుకోకుండా ఆపేవారు.ఎందుకంటే శాస్త్రీయ కారణాల కంటే మూఢనమ్మకాలు చెప్పినప్పుడే జనాలు ఎక్కువగా నమ్ముతారు.అందుకే ఈ విధంగా మన పెద్దలు చెప్పేవాళ్లు.