వైట్ హెయిర్( White hair ).ప్రతి రోజుల్లో చాలా మందిని కలవర పెడుతున్న సమస్య ఇది.
వయసు పైబడిన వారే కాదు వయసులో ఉన్న వారికి కూడా వైట్ హెయిర్ వచ్చేస్తుంది.ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి.
అయితే తలలో తెల్ల వెంట్రుకలు కనపడగానే తెగ ఆందోళన చెందుతూ ఉంటారు.డైయింగ్ తో తెల్ల వెంట్రుకలను కవర్ చేసుకుంటూ నానా తిప్పలు పడుతుంటారు.
కానీ డైయింగ్ అవసరం లేకుండా వైట్ హెయిర్ కు బై బై చెప్పవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ చాలా బాగా సహాయపడుతుంది.
ఆయిల్ తయారీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ ఆవ నూనె ( Mustard oil )పోసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు హెన్నా పౌడర్,( henna powder ) రెండు టేబుల్ స్పూన్లు భృంగరాజ్ పౌడర్,( Bhringraj Powder ) రెండు టేబుల్ స్పూన్లు ఆమ్లా పౌడర్, రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్ వేసి గరిటెతో తిప్పుతూ ఉడికించాలి.దాదాపు పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఆపై స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకుని పూర్తిగా కూల్ అయ్యాక ఒక బాటిల్ లో నింపుకోవాలి. వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.నాలుగు గంటల అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.
తెల్ల జుట్టు సమస్యను వదిలించడానికి ఈ ఆయిల్ ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను వాడితే జుట్టు తెల్లబడటం ఆగుతుంది.అదే సమయంలో తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.కాబట్టి వైట్ హెయిర్ సమస్యతో వర్రీ అవుతున్న వారు తప్పకుండా ఆ ఆయిల్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.