టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్( Prabhas ) వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.మరో రెండేళ్ల వరకు ప్రభాస్ డేట్స్ ఖాళీగా లేవు.
అయితే ప్రభాస్ తో సినిమా తెరకెక్కించాలని భావిస్తున్న దర్శకుల సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉంది.అయితే ప్రభాస్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని ముగ్గురు స్టార్ డైరెక్టర్లు రేసులో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.
ది రాజాసాబ్ మూవీని( The Rajasaab ) దాదాపుగా పూర్తి చేసిన ప్రభాస్ ఫౌజీ, స్పిరిట్ సినిమాలను వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి చేసే ఛాన్స్ ఉంది.కల్కి2, సలార్2 సినిమాల షూటింగ్స్ ఎప్పటినుంచి మొదలవుతాయో కచ్చితంగా చెప్పలేము.అయితే ప్రభాస్ తర్వాత సినిమాల డైరెక్టర్ల జాబితాలో అట్లీ,( Atlee ) లోకేశ్ కనగరాజ్,( Lokesh Kanagaraj ) ప్రశాంత్ వర్మ( Prashanth Varma ) ఉన్నారు.ఈ ముగ్గురు డైరెక్టర్లతో ప్రభాస్ సినిమాలు ప్రకటిస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు.

ప్రభాస్ తో సినిమాలు చేసి సక్సెస్ సాధించిన ప్రతి డైరెక్టర్ పేరు ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో మారుమ్రోగుతోంది.ప్రభాస్ రెమ్యునరేషన్ పరంగా టాప్ లో ఉండగా ప్రభాస్ భవిష్యత్తు సినిమాలు సైతం సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటూ ఉండగా భవిష్యత్తు సినిమాలతో ప్రభాస్ ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాలి.

ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉండగా ప్రభాస్ 2025లో అయినా పెళ్లికి సంబంధించిన తీపికబురు చెబుతారేమో చూడాల్సి ఉంది.ప్రభాస్ తో సినిమాలను నిర్మించడానికి టాలీవుడ్ టాప్ బ్యానర్లు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రభాస్ రేంజ్ ను అందుకోవడం మిగతా హీరోలకు ఇప్పట్లో సాధ్యం కాదు.
ప్రభాస్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య సైతం ఊహించని స్థాయిలో పెరుగుతోంది.