కర్ణాటక రాష్ట్రం( Karnataka State )లోని బళ్లారి నియోజకవర్గం ఎన్నికలు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే నిలుస్తాయి.ఈ నియోజకవర్గం 1999 ఎన్నికల్లో దేశంలో అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ, బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్‌పై పోటీ చేశారు.నెక్-టు-నెక్ సాగిన ఆ పోటీలో బళ్లారి ప్రజల సోనియానే గెలిపించారు.
జోక్ ఏంటంటే, జస్ట్ 15 రోజుల్లో కన్నడ భాష నేర్చుకొని కన్నడంలో మాట్లాడి అక్కడ ప్రజల గుండెల్లో గుడి కట్టేసుకున్నారు సుష్మా స్వరాజ్.ఎన్నికల్లో ఓడిపోయినా సరే ఎందుకో ఆమె కన్నడ భాష పై మంచి అభిమానం పెంచుకున్నారు.20 ఏళ్ల పాటు కర్నాటక నుంచి కలిసేందుకు ఎవరు వచ్చినా వారితోని కన్నడంలోనే మాట్లాడేవారు.హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గలంగా మాట్లాడే వారితో ఆ భాషల్లోనే ఆమె మాట్లాడేవారు.
అక్కడ గెలిచిన తరువాత సోనియా గాంధీ ఆ స్థానానికి రిజైన్ చేశారు.అమేధికి తన రాజకీయ జీవితాన్ని షిఫ్ట్ చేశారు.
సుష్మా స్వరాజ్ మాత్రం బళ్లారితో కనెక్షన్ కట్ చేసుకోలేదు.ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే 25 ఏళ్లకు మళ్ళీ దేశవ్యాప్తంగా అందరి కళ్లూ వయనాడ్( Wayanad ) నియోజకవర్గంపై పడ్డాయి.
ఇక్కడ లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చాయి.రాహుల్ గాంధీ గతంలో ఇక్కడ పోటీ చేసి గెలిచారు.
ఇప్పుడు దాన్ని వదిలేసి రాయబరేలికి వెళ్లిపోయారు.ప్రస్తుతం ఇక్కడ బై పోల్ రావడంతో మళ్లీ రాహుల్ గాంధీ ( Rahul Gandhi )పోటీ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు.
కానీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కూతురు, రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక వాద్రాని బరిలోకి దింపింది.

ఆమెపై పోటీగా బీజేపీ నుంచి నవ్య హరిదాస్ ( Navya Haridas )బరిలోకి దిగారు.ఆమె మలయాళీ.అంటే కేరళలోనే పుట్టి పెరిగింది.
గతంలో 2021 ఎన్నికల్లో కోజికోడ్ సౌత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయింది.వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్.
ప్రస్తుతం కార్పొరేషన్లో బీజేపీకి పార్లమెంటరీ పార్టీ నాయకురాలిగా వ్యవహరిస్తోంది.ఇక ప్రియాంక వాద్రా బ్యాక్‌గ్రౌండ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ నవ్య హరిదాస్ ఎవరనేదే చాలామందికి తెలియడం లేదు.బీజేపీ ఈమెను ఎలా నమ్మింది, ముస్లిం వోట్ల మద్దతుతో బలమైన కాంగ్రెస్ అభ్యర్థిగా కనిపిస్తున్న ప్రియాంక వాద్రాని ఈమె ఓడించడం సాధ్యమేనా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆమె గురించి కొన్ని వివరాలు బయటకు వచ్చాయి.వాటి ప్రకారం నవ్య హరిదాసు 2007లో మెకానికల్ ఇంజనీరింగులో బీటెక్ చేసి రాజకీయాల్లో అరంగేట్రం చేసింది.కోజికోడ్ కార్పొరేషన్‌కు రెండుసార్లు కౌన్సిలర్‌గా సెలెక్ట్ అయ్యింది.కార్పొరేషన్లో బీజేపీ పక్ష నేతగా కొనసాగుతూ చాలామంది దృష్టిని ఆకర్షించింది.అందుకే ఆమెను బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని చేశారు.నవ్య హరిదాసు ఒక మంచి వక్త.
అనేక విషయాల మీద చాలా గొప్ప అవగాహన సాధించింది.వయనాడ్ ప్రజలు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈమెను గెలిపిస్తారా? లేదా కాంగ్రెస్ కే ఓట్లు గుద్దుతారా అనేది తెలియాలి.ఇక్కడ ముస్లిం ఓటర్లు చాలా ఎక్కువగా ఉన్నారు.వారికి బీజేపీ అంటే నచ్చదు అని చెప్పుకోవచ్చు.అందువల్ల ఇప్పుడు ఇక్కడి నుంచి ఎవరు గెలుస్తారనేది చాలా ఆసక్తికరంగా మారిందిమరోవైపు ఇదే బైపోల్ ఎన్నికలలో సీపీఐ పార్టీ 71 ఏళ్ల సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సత్యన్ మొకెరీని అభ్యర్థిగా ప్రకటించింది.సో, ముగ్గురు మధ్య చాలా పెద్ద పోటీ ఉండొచ్చని తెలుస్తోంది.