దర్శకుడు బలగం వేణు( Director Balagam Venu ) గురించి తెలుగు జనాలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బలగం అనే సినిమాతో ఎమోషన్స్‌ను తెరపై బలంగా ప్రజెంట్ చేయగల దర్శకుడిగా వేణు మంచి పేరు సంపాదించుకున్నాడు.
అప్పటిదాకా జబర్దస్త్ బాపతు కమెడియన్ గానే పరిచయం అయిన వేణు బలగం వచ్చాక తనలో రియల్ టాలెంట్ ఈ ప్రపంచానికి తెలిసింది.కట్ చేస్తే, మొదటి సినిమాతోనే వేణు ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు.
ఆ తరువాతే అసలు ట్విస్ట్ ఎదురయింది వేణుకి.సాధారణంగా పెద్ద పెద్ద దర్శకులకు ద్వితీయ గండం అనేది ఉంటుంది.
ఎందుకంటే, ఫస్ట్ సినిమాతో పోలిక ఉంటుంది, అంచనాలు ఉండనే ఉంటాయి.
ఈ క్రమంలోనే వేణు బలగం సినిమాకు( Balagam Movie ) ఏరకంగానైతే తెలంగాణ నేపధ్యాన్ని ఎంచుకున్నాడో, సేమ్ తన రెండో సినిమాకూ అలాంటి కథనే రాసుకుని, దానికి “ఎల్లమ్మ”( Yellamma ) అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నాడు.ఇక్కడే మొదలైంది అసలు కథ.బలగం సినిమాలో ప్రియవర్శి తప్ప మిగతా వాళ్లెవరూ పెద్ద పేరున్న నటీనటులు లేరు.దాంతోనే వారిలోని నటనను పిండుకోవడానికి, తను అనుకున్నట్టుగా కథనం, సీన్లు రావడానికి వేణు ఎక్కడా రాజీపడకుండా కష్టపడ్డాడు.పెద్ద నటులైతే వేణుకు ఆ స్కోప్ ఉండేది కాదు.
ఎందుకంటే, పరిమితులు తనను బంధించేస్తాయి.అందుకే ఎప్పుడైతే పెద్ద హీరో కావాలని అనుకున్నాడో అప్పట్నుంచే ఎల్లమ్మకు కష్టాలు స్టార్టయ్యాయి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మొదట ఈ సినిమాలో హీరో నాని( Hero Nani ) అని టాలీవుడ్ కోడై కూసింది.కానీ నాని ఆల్రెడీ దసరాలో తెలంగాణ యువకుడి పాత్ర పోషించి మెప్పించాడు.అందుకేనేమో నాని మళ్లీ తెలంగాణ పాత్ర దేనికిలే అనుకొని వద్దన్నాడు.ఆ తరువాత అచ్చ తెలుగు తెలంగాణ ప్రాంతీయుడు నితిన్ ని( Nithin ) అనుకున్నారు.కానీ మనోడు కూడా చేయను పొమ్మన్నాడు.తరువాత తేజ సజ్జా( Teja Sajja ) లైన్లోకి వచ్చాడు.
హనుమాన్ తరువాత రేంజ్ పెరిగింది కాబట్టి, తేజ కూడా వద్దన్నాడు.కథ మళ్లీ నితిన్ వద్దకు వెళ్లగా తను కథలో మార్పులు, చేర్పులు చేయమని సూచించాడట.
చివరకు వేణు సరేనన్నాడని టాక్ వినబడుతోంది.అదే సమయంలో వేణు తను అనుకున్నట్టుగా సినిమా తీయగలుగుతాడా అనే అనుమానం ఇపుడు నడుస్తోంది! ఈ క్రమంలోనే వేణు, తన సన్నిహితుల దగ్గర అనవసరంగా స్టార్ హీరోల చుట్టూ తిరుగుతున్నానని వాపోతున్నాడట పాపం! ఇక మన వేణుని ఆ ఎల్లమ్మ తల్లే గట్టెక్కించాలని కోరుకుందాం!
.