ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్క వ్యాపార సంస్థలు కూడా వ్యాపార ప్రకటనల కోసం అనేక వీడియోలు , ఫోటోలను ప్రమోట్ చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.ఇలా ప్రమోషన్ల భాగంగా కొన్ని వీడియోలు, ఫోటోలు వివాదాలకు కూడా దారి తీసిన సంఘటనలు చాలానే ఉన్నాయి.
ఇలాంటి వివాదం ముదిరిన తర్వాత ఆ సంస్థ వారు క్షమాపణలు చెప్పిన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి.అచ్చం అలాంటి సంఘటననే ఒకటి ప్రముఖ ఈ కామర్స్ అయిన ఫ్లిప్ కార్ట్ కు( Flipkart ) ఎదురైంది.
ఫ్లిప్ కార్ట్ చేసిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో పాటు తీవ్ర వివాదానికి దారితీసింది.ఈ వీడియో పై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వివాదం ఎక్కువ అవ్వడంతో చివరికి ఫ్లిప్ కార్ట్ పురుషులకు( Men ) క్షమాపణలు కూడా తెలియజేసింది.
ఇక వాస్తవానికి ఆ యాడ్ లో( Ad ) ఏముంది? అసలు ఫ్లిప్‌కార్ట్ క్షమాపణలు చెప్పడానికి గల కారణం ఏమిటన్న విషయానికి వస్తే… ప్రస్తుతం దసరా పండుగ నేపథ్యంలో ఫ్లిప్ కార్ట్ లో బిగ్ బిలియన్ డేస్ ( Big Billion Days ) పేరుతో అన్ని ప్రొడక్ట్స్ పై భారీ డిస్కౌంట్స్ ను అందజేస్తున్నాయి.ఇందులో భాగంగానే ఈ సేల్స్ ప్రమోషన్లో భాగంగా ఫ్లిప్ కార్ట్ ఒక యానిమేటెడ్ వీడియోను క్రియేట్ చేసింది.మహిళలకు సంబంధించిన హ్యాండ్ బ్యాగ్ లకు( Handbags ) సంబంధించి ఒక వీడియోను రూపొందించి అందులో అసభ్యతకర విషయాలను ప్రస్తావించారు.బిగ్ బిలియన్ డే స్పెషల్ లో భాగంగా తాము హ్యాండ్ బ్యాగులపై భారీ డిస్కౌంట్ అందిస్తామని మీ భర్తలకు తెలియకుండా కొనుగోలు చేసిన హ్యాండ్ బ్యాగ్‌లను ఎలా దాచి పెట్టాలో చెబుతూ ఒక యాడ్ ను చేశారు.
ఈ సందర్భంగా భర్తలను దూషిస్తూ అసభ్యకర వ్యాఖ్యలను చేస్తూ వీడియోను డిజైన్ చేయడంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.ఇక ఈ వీడియో చూసిన కొంతమంది నెటిజన్స్ ఫ్లిప్ కార్ట్ తీరుపై ఒక రేంజ్ లో ఫైర్ అయిపోయారు.ఇక కేవలం పురుషులే కాకుండా మహిళల కూడా ఫ్లిప్ కార్ట్ పై ఫైర్ అవ్వడం మనం ట్వీట్స్ ద్వారా చూడొచ్చు.మీ ప్రమోషన్స్ కోసం మగవారిని దూషిస్తారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక చివరికి ఈ యాడ్ వీడియోను డిలీట్ చేయడంతో పాటు ఫ్లిప్ కార్ట్ సంస్థ ‘ఇలాంటి వీడియో వచ్చినందుకు మేం చింతిస్తున్నాం.తప్పు మాదేనని అంగీకరించాం.
భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడతాం’ అంటూ తెలిపారు.