ఓరి మీ దుంపతెగ.. అంత్యక్రియల్లో నవ్వులు, డ్యాన్సులేంట్రా.. (వీడియో)

మరణం అంటే విషాదం.కన్నీళ్లు.

 Tamil Nadu Family Celebrates Death Of 96-year-old Woman To Fulfil Her Last Wish-TeluguStop.com

కానీ తమిళనాడులోని( Tamil Nadu ) మధురై జిల్లా ఉసిలంపట్టిలో జరిగిన ఒక సంఘటన మాత్రం దీనికి పూర్తి భిన్నం.అక్కడ 96 ఏళ్ల నాగమ్మాళ్ అనే బామ్మగారి అంతిమ యాత్ర కన్నీళ్లతో కాదు.

పాటలు, డ్యాన్సులతో ఒక పండుగలా జరిగింది.వృద్ధాప్య సమస్యలతో కన్నుమూసిన నాగమ్మాళ్, చనిపోయే ముందు ఒక కోరిక కోరారు.

తన అంత్యక్రియలు దుఃఖంతో కాకుండా పాటలు, నృత్యాలతో నిండి ఉండాలని ఆమె చెప్పారు.దేవాలయ పూజారి అయిన పరమతదేవర్ ఆమె భర్త.

వీరికి ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు, ఏకంగా 78 మంది మనవళ్లు, మునిమనవళ్లతో ఒక పెద్ద కుటుంబం ఉంది.

బామ్మగారి చివరి కోరిక వినగానే కుటుంబ సభ్యులు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు.ఆమె కోరికను నెరవేర్చాలని నిశ్చయించుకున్నారు.అంతే! అంత్యక్రియల ప్రాంగణం ఒక పండుగ వాతావరణాన్ని తలపించింది.

డప్పు చప్పుళ్లు, పాటల మోతలతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది.బంధువులు, స్నేహితులు కన్నీళ్లకు బదులు నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ బామ్మగారికి వీడ్కోలు పలికారు.

సాధారణంగా అంత్యక్రియల( Funeral ) దగ్గర ఉండే విషాద ఛాయలు అక్కడ ఎక్కడా కనిపించలేదు.నాగమ్మాళ్ చివరి కోరికను గౌరవించడమే కాకుండా, మరణాన్ని( Death ) కూడా ఒక వేడుకలా జరుపుకోవచ్చని ఈ కుటుంబం చాటి చెప్పింది.

ఈ ఘటన స్థానికంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.ఈ బామ్మ కోరిక తెలియని చాలామంది ముందు ఓరి మీ దుంపతెగ, అంత్యక్రియల్లో నవ్వులు, డ్యాన్సులేంట్రా అని అనుకున్నారట.ఆ తర్వాత ఇలా చేయడం వెనుక ఒక మంచి కారణం ఉందని తెలుసుకొని వారు కూడా సంతోషించారట.ఆమె కోరిక మేరకు, కుటుంబ సభ్యులు, పిల్లలు, మనవళ్లతో సాంప్రదాయ జానపద కళలు, సంగీతం, నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.

మహిళలు కుమ్మి నృత్యం( Kummi Dance ) చేయగా, పిల్లలు తమ ప్రతిభను చాటారు.ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు అంత్యక్రియలలో డాన్సులేంటి? ఇదేం బాగోలేదు అని అనగా మరి కొంతమంది ఆ అవ్వ తన జీవితం పూర్తిగా ఆస్వాదించింది, ఎలాంటి నొప్పి లేకుండా హాయిగా చనిపోయింది, ఆమెను సంతోషంగా అలా సాగనంపడంలో తప్పేముంది అని ప్రశ్నిస్తున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube