వీడియో వైరల్: క్షణాలలో 8 సార్లు పల్టీ కొట్టిన కారు.. చివరకి?

ప్రస్తుత రోజులలో సోషల్ మీడియా వినియోగం ఎక్కువగా అయిపోయినందున ప్రపంచన ఏ దిక్కున ఏమి జరిగినా కానీ అందరికి విషయాలు ఇట్టే తెలిసిపోతున్నాయి.ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న వాహనాలు వివిధ రకాల స్టంట్స్ చేయడం, యాక్సిడెంట్స్( Accident ) లాంటివి సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.

 Car Took Many Turns The Good Thing Despite Everyone Safe Video Viral Details, A-TeluguStop.com

ఇందులో భాగంగానే ప్రస్తుతం ఒక కారు ప్రమాదానికి( Car Accidents ) సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.చావు అంచుల వరకు వెళ్లిన ఒక ఐదుగురు వారి అదృష్టం బాగుండి క్షణాలలో బయటపడ్డారు.

ఈ దారుణ సంఘటన రాజస్థాన్లో( Rajasthan ) చోటుచేసుకుంది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.రాజస్థాన్ లోని నాగౌర్ ప్రాంతంలో తాజాగా ఒక ఐదుగురు వ్యక్తులు కారులో బికనేర్ కు వెళ్తున్నారు.మార్గమధ్యంలో ఒక మలుపు వద్ద కారు అదుపుతప్పి క్షణాలలో 8 సార్లు పల్టీ కొట్టింది.

ఈ క్రమంలో కారు వెళ్లి ఒక కారు షోరూం గేటు పై పడింది.అయితే, ఆశర్యకరంగా ఈ సంఘటనలో ఎవరికి ఎటువంటి గాయం కాలేదు. కానీ, కారు పల్టీ కొడుతున్న సమయంలో అందులో ఉన్న వారు అందరూ కూడా సురక్షితంగా బయటికి దూకేయడంతో ఎవరికి ఎటువంటి ప్రమాదం సంభవించలేదు.సాధారణంగా కారు పార్టీలు కొట్టడం అంటే మామూలు విషయం కాదు.

అందులో ఉన్నవారు ఎవరు కూడా బతికే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

కానీ, వీరి అదృష్టం( Luck ) బాగుండే అందరూ కూడా ప్రాణాలతో బయటపడ్డారు.అంతేకాకుండా పక్కనే ఉన్న కారు షో రూమ్లకు వెళ్లి మాకు కొంచెం టీ ఇస్తారా అంటూ అడగడం చూసి షో రూమ్ సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు.ఇక ఈ వీడియోని చూసిన కొంతమంది నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

వామ్మో మీరు చాలా అదృష్టవంతులు అని కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటే.మరికొందరు కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి కదా అని కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube