1000 కోట్లు సాధిస్తేనే సినిమా హిట్.. సౌత్ సినిమాలు ప్రూవ్ చేస్తున్న లెక్క ఇదేనా?

ఇటీవల కాలంలో బాక్సాఫీస్ వద్ద ఎక్కువగా పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది.చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు ప్రతి ఒక్కరు కూడా పాన్ ఇండియా సినిమాల( Pan India Movies ) పైన ఫోకస్ పెడుతున్నారు.

 Special Focus On Pan India Movies And Record Collections Details, Kgf , Pan Indi-TeluguStop.com

అలా పెద్ద సినిమాలు అంటే కలెక్షన్లు ఈ కోట్లు అన్నది కామన్ గా మారిపోయింది.ఒక్కొక్క సినిమా రికార్డులను తిరగరాస్తు అత్యధిక కలెక్షన్లను సాధిస్తూ దూసుకుపోతున్నాయి.

దీంతో సక్సెస్ కు మన సినిమాలు కొత్త నిర్వచనం ఇస్తున్నాయా? హిట్ కు 1000 కోట్లు అనేది బెంచ్ మార్క్ గా గా మారిపోనుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఈ ప్రశ్నలే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Telugu Salaar, Crore, Allu Arjun, Kalki, Pan India, Pushpa, Pushpa Rule, Tollywo

పాన్ ఇండియా ట్రెండ్ మొదలయ్యాక బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ అవుతున్నాయి.మూవీ మేకింగ్ దగ్గరి నుంచి కలెక్షన్ల వరకు అన్నీ కొత్త కొత్తగా అన్నట్లు కనిపిస్తోంది సీన్.వెయ్యి కోట్ల కలెక్షన్లు( 1000 Crore Collections ) కామన్ అయిపోయాయి.ఆ రేంజ్ వసూళ్లు అంటే అసలు సాధ్యమేనా అనుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు మన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరిపోతున్నాయి.

పాత రికార్డులను బ్రేక్ చేయడమే కాకుండా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త చరిత్ర క్రియేట్ చేస్తున్నాయి.పుష్ప 2తో( Pushpa 2 ) అది మళ్లీ ప్రూవ్ అయ్యింది.

Telugu Salaar, Crore, Allu Arjun, Kalki, Pan India, Pushpa, Pushpa Rule, Tollywo

వారం రోజుల్లో ఈజీగా వెయ్యి కోట్లు దాటేసింది పుష్ప 2.దీంతో ఇప్పుడు కొత్త చర్చ తెర మీదకు వస్తోంది.ఒకప్పుడు 100 కోట్లు కొడితే బ్లాక్ బస్టర్ అనే వారు.అలాంటిదిప్పుడు వెయ్యి కోట్లు అనేది హిట్ సినిమాకు బెంచ్ మార్క్ గా మారిందా అనే చర్చ మొదలైంది.1000 కోట్లు అన్నది ఇటీవల కాలంలో కామన్ అయిపోయింది.ఇక పై అన్ని సినిమాలు ఇదే ట్రెండ్ ఫాలో అవుతాయా? వెయ్యి కోట్ల కలెక్షన్స్ హీరో మీద, ఇండస్ట్రీ మీద చూపించే ఎఫెక్ట్ ఏంటి? టాలీవుడ్ నుంచి వెయ్యి కోట్ల క్లబ్ లో ఇకపై చేరే ఛాన్స్ ఉన్న మూవీస్ ఏంటి? ఇకమీదట వచ్చే సినిమాలు ఈ ఫీట్ ని సాధించగలవా లేదా అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube