టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి( Keeravani ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో మంచి మంచి సినిమాలకు సంగీతాన్ని అందించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కీరవాణి.
ఇకపోతే కీరవాణి చిన్న కొడుకు శ్రీ సింహ( Sri Simha ) గురించి కూడా మనందరికీ తెలిసిందే.ఇటీవలే మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడు శ్రీ సింహ.
దుబాయ్ లో డిసెంబర్ 14న డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది.శ్రీ సింహ నటుడు రాజకీయ నాయకుడు అయిన మురళీమోహన్ మనవరాలు రాగా మాగంటి( Raaga Maganti ) మెడలో మూడు ముళ్ళు వేసిన విషయం తెలిసిందే.
పెళ్లి ఫొటోలు అనధికారికంగా కొన్ని బయటకొచ్చాయి.కానీ ఇప్పుడు శ్రీ సింహా స్వయంగా తన భార్య గురించి స్పెషల్ పోస్ట్ పెట్టాడు.ఇప్పటికి ఆరేళ్లయింది.ఎప్పటికీ ఇలానే అని రాసిపెట్టడంతో పాటు రాసిపెట్టుంది అని య్యాష్ ట్యాగ్ ఒకటి పెట్టాడు.దీని బట్టి చూస్తుంటే గత ఆరేళ్లుగా రాగ మాగంటితో ప్రేమలో ఉన్న శ్రీ సింహా కొన్నాళ్ల క్రితం పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది.అయితే కొన్ని రోజుల క్రితం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరగగా ఈ నెల 14న దుబాయిలోని ఒక ఐలాండ్ లో పెళ్లి జరిగింది.
ఇందులో రాజమౌళి డ్యాన్స్ చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి.మురళీ మోహన్‌కు కొడుకు రామ్ మోహన్ కుమార్తె రాగ.
విదేశాల్లో బిజినెస్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది.ప్రస్తుతం రాగ కూడా తన కుటుంబానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు చూసుకుంటోంది.ఇకపోతే శ్రీసింహ విషయానికి వస్తే.యమదొంగ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాడు.మత్తు వదలరా( Mathu Vadalara ) రెండు చిత్రాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.తెల్లవారితే గురువారం, దొంగలు ఉన్నారు జాగ్రత్త, ఉస్తాద్ తదితర సినిమాల్లోనూ హీరోగా నటించాడు.
కీరవాణి పెద్దబ్బాయి కాలభైరవకు ఇంకా పెళ్లి కాలేదు.ఈలోపే చిన్నబ్బాయికి పెళ్లి జరిగిపోయింది.