ప్రస్తుతం ప్రతి ఒక్క ఇంట్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్( Software engineer ) గా విధులు నిర్వహిస్తున్న వారు ఉండే ఉంటారు.అయితే పేరుకే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా కానీ వారు ఎదురుకోవలసిన ఇబ్బందులు చాలానే ఉంటాయి.
వారికి భారీ స్థాయిలో జీతం వస్తున్నా కానీ వారికి అనేక ఇబ్బందులు వస్తున్నాయని వారి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు కొందరు.అచ్చం అలాంటి సంఘటననే ఒకటి కెనడాలో టొరంటో( Toronto ) ప్రాంతంలో చోటు చేసుకుంది.
అక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఒక యువతి తన బాధను వ్యక్తం చేస్తూ ప్రతి ఏడాది ఆమెకు 75 లక్షల వరకు జీతం వస్తుందని అయినా కానీ జీవితంలో సుఖం లేదు, అలాగే జీవితంలో ఆహ్లాదకరంగా గడిపే అవకాశం కూడా లేదు అంటూ తన బాధను వ్యక్తం చేసింది.ఈ క్రమంలో తాను మూడు సంవత్సరాల క్రితం కెనడా( Canada )కు వచ్చానని ఇక్కడ ఒక ప్రముఖ కంపెనీలో ఐటీ ఉద్యోగిగా పని చేస్తున్ననని, ప్రతి సంవత్సరం నాకు 75 లక్షల వరుకు వేతనం వస్తుంది కానీ.
అదే స్థాయిలో ఖర్చులు కూడా ఉన్నాయి అంటూ తెలియచేసింది.
గతంలో ఒక బట్టర్ బ్రెడ్ కొనాలి అంటే నాలుగు డాలర్లుగా ఉండేది కానీ.ప్రస్తుతం అది 8 డాలర్ లుగా పెరిగింది, అలాగే ఉంటున్న ఇంటికి అద్దె కూడా 1600 డాలర్లు చెల్లించాల్సి వస్తుందని ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఖర్చులు ఉన్నాయంటూ , కేవలం ఖర్చులు మాత్రమే పెరుగుతున్నాయని వేతనాలు పెరగటం లేదు కంపెనీ ఆ దిశగా ఆలోచించడం లేదు అంటూ ఆ మహిళ తెలియజేసింది.అదే మన ఇండియాలో అయితే 30000 సంపాదించిన చాలు ఎలాగైనా బతకవచ్చు, అలాగే ఆర్థిక మధ్యమం లాంటివి కూడా మనం ఎదుర్కోవచ్చు కానీ ఇక్కడ అలా కాదు ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉంటుంది, ఏదైనా చిన్న సౌకర్యం కూడా డబ్బుతోనే పొందాల్సి ఉంటుంది అంటూ ఆ ఐటి ఉద్యోగి తెలియజేసింది .
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను పీయూష్ మొంగా( Piyush Monga ) అనే వ్యక్తి ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేశాడు.వాస్తవానికి ఇతడు ఒక యూట్యూబర్ డాలర్ డ్రీమ్స్ నేపథ్యంలో విదేశాలకు వెళ్లి అక్కడ జీవిస్తున్న వారి సంపాదిస్తున్న వారి వివరాలను తెలుసుకుంటూ ఈ క్రమంలో ఉద్యోగం చేస్తున్న ఆ అమ్మాయి వేతనం ఇతర వివరాల గురించి ప్రశ్నించే సమాధానాలు తెలియజేశారు.ఇక ఆ యువతి చెప్పిన సమాధానాలకు నెటిజెన్లు స్పందిస్తూ… ఎంచక్కా ఇండియాలోనే ఉంటూ ఉద్యోగం చేసుకుంటూ బతకకుండా అంత దూరం వెళ్లడం ఎందుకు., అంత ఇబ్బంది పడడం ఎందుకు అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇక మరికొందరు అయితే వీలైనంత తొందరలో ఇండియా( India )కు వచ్చేసి ఇక్కడే తన జీవనాన్ని కొనసాగించుకోవాలని సూచనలు కూడా ఇస్తున్నారు.