వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన ప్రవాస భారతీయులు. కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటూ స్వదేశానికి ఎన్నో రకాలుగా లాభాలను చేకూరుస్తున్నారు.
వీరి వల్ల పెద్ద సంఖ్యలో విదేశీ మారక ద్రవ్యం భారతదేశ ఖజానాకు జమ అవుతోంది.మరికొందరైతే స్వదేశంలో భారీగా పెట్టుబడులు పెట్టి.
ఎంతో మంది స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తున్నారు.ఇక కోవిడ్ తదితర విపత్తుల సమయంలో ఎన్ఆర్ఐలు( NRI’s ) చేసిన సాయాన్ని ఈ దేశం మరిచిపోదు.
కాగా.దేశంలోని పలు బ్యాంకులు అందిస్తున్న ఎన్ఆర్ఐ పథకాలలో డిపాజిట్లు గత జూలైలో 11 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.దీనికి కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ తీసుకుంటున్న చర్యలే కారణమని విశ్లేషకులు అంటున్నారు.ఆర్‌బీఐ డేటా( RBI Data ) ప్రకారం.ఎన్ఆర్ఐల డిపాజిట్లు జూలైలో 1,41,850 మిలియన్ డాలర్ నుంచి 1,57,157 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.ఎన్ఆర్ఐ డిపాజిట్లు( NRI Deposits ) పెరగడంపై బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన ఆర్ధిక నిపుణుడు అదితి గుప్తా( Aditi Gupta ) మాట్లాడుతూ.
ఇండియాలో వృద్ధి మిగిలిన దేశాలతో పోలిస్తే మెరుగ్గా ఉందన్నారు.
ఎన్ఆర్ఐలు ఎక్కువగా మూడు రకాల పథకాలలో తమ పెట్టుబడులు మళ్లించారు.అవి .ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ బ్యాంక్స్ (ఎఫ్‌సీఎన్ఆర్ (బీ)) , నాన్ రెసిడెంట్ ఎక్స్‌టర్నల్ రూపీ అకౌంట్ (ఎన్ఆర్ఈ (ఆర్ఏ)), నాన్ రెసిడెంట్ ఆర్డినరీ (ఎన్ఆర్ఓ) డిపాజిట్ అకౌంట్.జూలై నాటికి ఎఫ్‌సీఎన్ఆర్ (బీ)లో 28,572 మిలియన్ డాలర్లు.ఎన్ఆర్ఈ (ఆర్ఏ)లో 99,981 మిలియన్ డాలర్లు.ఎన్ఆర్ఐలో 28,603 మిలియన్ డాలర్లు డిపాజిట్లుగా ఉన్నాయి.
2023 ఏప్రిల్ – జూలైలో 3,013 మిలియన్ డాలర్లతో పోలిస్తే.2024 ఏప్రిల్ – జూలై నాటికి ఈ ఖాతాలో డిపాజిట్ల ఫ్లో 5,820కి చేరుకున్నాయి.ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ .ఫెడరల్ ఫండ్స్ రేటు విషయంలో తీసుకుంటున్న చర్యలు కూడా ఎన్ఆర్ఐ డిపాజిట్లు పెరగడానికి కారణమని ఆర్ధిక నిపుణులు అంటున్నారు.