ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దేవర సినిమా( Devara ) ఎట్టకేలకు థియేటర్లలో విడుదల అయింది.నేడు థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే.
పాన్ ఇండియా లెవెల్ లో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో కూడా విడుదల అయింది.ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ అంటూ కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు.
ఇంకొందరు వారి అభిప్రాయాన్ని ట్విట్టర్లు ఇంస్టాగ్రామ్ వేదికగా తెలుపుతున్నారు.అలాగే తారక్ నటవిశ్వరూపం, అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయని ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు.
సింగిల్ స్క్రీన్ థియేటర్లయితే అరుపులతో దద్దరిల్లిపోతున్నాయి.వరల్డ్ వైడ్ వేల థియేటర్లలో రిలీజ్ కావడంతో తొలిరోజు వసూళ్లు గట్టిగానే రాబోతున్నాయని తెలుస్తోంది.ఇకపోతే ఈ సినిమాకు ఒక్కొక్కరు ఎంతెంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు అన్న విషయానికి వస్తే.ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్( NTR ) చేసిన సినిమా దేవర.గతంలో తారక్ తో జనతా గ్యారేజ్ తీసిన కొరటాల( Koratala ) దీనికి దర్శకుడు.సముద్రం బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తీసిన ఈ చిత్రానికి దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ పెట్టారని తెలుస్తోంది.ఎన్టీఆర్ అన్న కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్‌తో కలిసి సంయుక్తంగా నిర్మించారు.
ఇక పారితోషికాల విషయానికొస్తే దేవర సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన ఎన్టీఆర్ దాదాపు రూ.60 కోట్లు తీసుకున్నాడని తెలుస్తోంది.హీరోయిన్‌గా చేసిన జాన్వీ( Janhvi ) రూ.5 కోట్లు, విలన్‌గా చేసిన సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan ) రూ.10 కోట్లు, ఇతర కీలక పాత్రలు పోషించిన ప్రకాశ్ రాజ్ రూ 1.5 కోట్లు, శ్రీకాంత్ రూ.50 లక్షలు, మురళీశర్మ రూ.40 లక్షలు తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది.కెప్టెన్ ఆఫ్ ద షిప్ అయిన దర్శకుడు కొరటాల శివ ఏకంగా రూ.30 కోట్ల వరకు అందుకున్నాడని సమాచారం.