ఎన్టీఆర్( NTR ) ఇటీవల కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో నటించిన దేవర సినిమా( Devara ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 27వ తేదీ విడుదల అయ్యి ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.
ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి సినిమాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు.ఇప్పటికే బాలీవుడ్ చిత్రం వార్ 2 సినిమా షూటింగ్ పనులలో ఎన్టీఆర్ బిజీ అయ్యారు ప్రస్తుతం ఎన్టీఆర్ కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో బిజీ కాబోతున్నారు.ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా రెండో భాగం( Devara Part 2 ) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అయితే రెండో భాగం గురించి ఎంతోమంది అభిమానులు ఆరా తీయడం మొదలు పెట్టారు.దేవర సినిమాలో నటించిన నటీనటులు ఎవరు మీడియా సమావేశంలో పాల్గొన్న వారికి దేవర సీక్వెల్ గురించి ప్రశ్నలు ఎదురవుతున్నాయి.ఇక దేవర సినిమాలో నటుడు అజయ్( Actor Ajay ) నటించిన సంగతి తెలిసిందే.

అజయ్ త్వరలోనే పొట్టేలు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది .ఈ కార్యక్రమం అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇందులో భాగంగా దేవర 2( Devara 2 ) గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.అందులో మీ పాత్ర ఎలా ఉండబోతుంది అంటూ రిపోర్టర్స్ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు అదే సమాధానం చెబుతూ దేవర సీక్వెల్ గురించి నేను ఒక్క మాట చెప్పిన నన్ను చంపేస్తారు.ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, ఈ విషయం గురించి నేను మాట్లాడను అయితే ఈ సినిమాలో నా పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని, ఇంతకుమించి ఒక మాట చెప్పిన కొరటాల శివ నన్ను చంపేస్తారంటూ అజయ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.