ఆడదే ఆధారం, డబ్బెవరికి చేదు, సగటు మనిషి, చిన్నారి దేవత, బజారు రౌడీ, ముద్దుల మావయ్య, ముత్యమంత ముద్దు, పోలీస్ భార్య, చెవిలో పువ్వు లాంటి అద్భుత సినిమాలతో తెలుగు సినిమా ప్రేక్షకులకు ఎంతో చేరువైన నటి సీత. ఈమె గురించి తెలియన పాతతరం జనాలు ఉండరంటే ఆశ్చర్యకం కలగక మానదు.
తన అందంతో పాటు అభినయంతో జనాలను మైమరిపించేలా చేసింది తను.తనతో పాటు కలిసి నటించిన తమిళ నటుడు పార్తీబన్ ను పెళ్లి చేసుకున్న సీత.ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల నుంచి తప్పుకుంది.ప్రస్తుతం వీరికి ఇద్దరు బిడ్డలున్నారు.
ఆ తర్వా ఓ అబ్బాయిని దత్తత తీసుకున్నారు.కొంత కాలం తర్వాత భార్యాభర్తల మధ్య తీవ్ర విభేధాలు రావడంతో 2001లో విడాకులు తీసుకున్నారు.
అనంతరం మళ్లీ సినిమా రంగంలోకి వచ్చింది.సెకెండ్ ఇన్సింగ్స్ ప్రారంభించి క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతుంది.2010లో ఆమె టీవీ ఆర్టిస్టు సతీష్ ను రెండో వివాహం చేసుకుంది.ఆరేండ్ల తర్వాత తనతోనూ విడిపోయింది.
ఇంతకీ సీత ఎవరు? ఎలా సినిమారంగంలోకి వచ్చింది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సీత తండ్రి తమిళవాసి కాగా.తల్లి తెలుగు మహిళ.సీత చెన్నైలోనే పుట్టి పెరిగింది.
తను పదో తరగతి చదువుతున్న రోజుల్లో తన తండ్రి మిత్రుడు ఒకాయన తన ఇంటికి వచ్చాడు.దర్శకుడు పాండ్యరాజా ఓ సినిమా చేస్తున్నాడని.
అందులో కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నాడని చెప్తాడు.సీతను ఆ సినిమాలో అవకాశం కోసం ప్రయత్నించ వచ్చుకదా అని చెప్పాడు.
ఇష్టమైతే దర్శకుడికి పరిచయం చేస్తానని చెప్పాడు.
సీత తండ్రి కూడా నటుడే.ఎన్నో స్టేజి షోలు చేశాడు.అందుకే తన కూతురుని సినిమాల్లోకి పంపించడంలో తప్పేమీ లేదనుకున్నాడు.
అప్పుడు దర్శకుడిని కలిశారు.దర్శకుడుకు కూడా సీతను ఓకే చేశాడు.
ఆణ్‌పావమ్ సినిమాలో హీరోయిన్ గా సినీ ప్రవేశం చేసింది సీత.ఆ సినిమా విజయంతో మరిన్ని అవకాశాలు వచ్చాయి.రాజాచంద్ర డైరెక్షన్‌లో శోభన్‌బాబు హీరోగా నటించిన విజృంభణ సినిమాతో తెలుగులో అడుగు పెట్టింది సీత.రెండో చిత్రం డబ్బెవరికి చేదు సినిమాలో నటించి మంచి విజయం సాధించింది.ఆ తర్వాత ఆమెకు చాలా అవకాశాలు వచ్చాయి.తెలుగు, తమిళ పరిశ్రమల్లో మంచి గుర్తింపు పొందింది సీత.