మనలో చాలామంది కెరీర్ పరంగా సక్సెస్ సాధించడానికి పేదరికం వల్ల ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి.తెలంగాణ సర్కార్ తాజాగా డీఎస్సీ ఫలితాలను( Telangana DSC Results ) రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ పరీక్ష ఫలితాలు ఎన్నో కుటుంబాల్లో ఆనందాన్ని నింపాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రాజన్న సిరిసిల్ల జిల్లాలోని( Rajanna Sircilla District ) నిమ్మపల్లికి చెందిన మరియాల కార్తీక్( Mariyala Karthik ) సక్సెస్ స్టోరీ నెట్టింట వైరల్ అవుతోంది.
పేదరికంతో పోరాడుతూ ప్రభుత్వ టీచర్ జాబ్( Govt Teacher Job ) సాధించిన కార్తీక్ ఈ జనరేషన్ లో ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు.అనారోగ్య సమస్యల వల్ల కార్తీక్ తల్లి మృతి చెందగా తండ్రి రాజబాబు చిన్న ఉద్యోగం చేస్తూ కొడుకును చదివించారు.
ఒకవైపు విద్యా వాలంటీర్ గా పని చేస్తూనే మరోవైపు దూరవిద్యలో ఎం.ఏ చేసిన కార్తీక్ రెండో ప్రయత్నంలో లక్ష్యాన్ని సాధించారు.
రెండో ర్యాంక్ తో జాబ్ సాధించిన కార్తీక్ తన సక్సెస్ తో ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.భార్య, తండ్రి సహకారం వల్లే తాను జాబ్ సాధించానని కార్తీక్ చెబుతున్నారు.బాల్యం నుంచి టీచర్ జాబ్ సాధించాలని భావించిన కార్తీక్ కష్టపడి చివరకు లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు.చదువుకు పేదరికం అడ్డు కాదని కార్తీక్ ప్రూవ్ చేశారు.
కష్టపడితే ఏదో ఒకరోజు సక్సెస్ సొంతం అవుతుందని తన సక్సెస్ తో కార్తీక్ చెప్పకనే చెప్పేశారు.మరియాల కార్తీక్ సక్సెస్ ను నెటిజన్లు ఎంతోమంది మెచ్చుకుంటున్నారు.మరియాల కార్తీక్ బాల్యం నుంచి చదువులో టాప్ లో ఉండేవారని తెలుస్తోంది.మరియాల కార్తీక్ విజయంతో గ్రామస్తులు ఎంతగానో సంతోషిస్తున్నారు.డీఎస్సీ సాధించిన ఎంతోమంది సక్సెస్ స్టోరీలు కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్లకు సంతోషాన్ని కలిగిస్తూ ఉండటం గమనార్హం.మరియాల కార్తీక్ టాలెంట్ ను నెటిజన్లు ఎంతగానో ప్రశంసిస్తున్నారు.