హమాస్ – ఇజ్రాయెల్(Hamas – Israel), ఇరాన్- ఇజ్రాయెల్(Iran – Israel), హెజ్‌బొల్లా – ఇజ్రాయెల్( Hezbollah – Israel) యుద్ధాలతో పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా ఉంది.తమకు పక్కలో బళ్లెంలా మారిన హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియా(Ismail Haniyeh), హమాస్‌కు మద్ధతుగా దాడులకు దిగిన హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా, లేటెస్ట్(గా అక్టోబర్ 7 దాడికి సూత్రధారి అయిన హమాస్ అధినేత యహ్యా సిన్వార్‌ను ఇజ్రాయెల్ మట్టుబెట్టి శత్రుశేషం లేకుండా చేసింది.
అయితే హమాస్, హెజ్‌బొల్లాల (Hamas , Hezbollah)వెనుకుండి నడిపిస్తున్న ఇరాన్‌కు కూడా బుద్ధి చెప్పాలని ఇజ్రాయెల్( Israel) రగిలిపోతోంది.ఇప్పటికే దాడికి ఏర్పాట్లు జరిగాయని, ఎక్కడెక్కడ దాడి చేయాలన్న దానిపై పక్కా బ్లూ ప్రింట్ సిద్ధంగా ఉందని అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ(Benjamin Netanyahu) ఆదేశాల కోసం ఐడీఎఫ్ వేచి చూస్తోంది.ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయోనని ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.
ఇదిలాఉండగా.ఇరాన్ మద్ధతున్న యెమెన్‌లోని హూతీ రెబల్స్(Houthi rebels) రెచ్చిపోతున్నారు.ఇప్పటికే ఎర్ర సముద్రం మీదుగా వెళ్తున్న వాణిజ్య నౌకలను టార్గెట్ చేస్తున్న వీరు.అప్పుడప్పుడు ఇజ్రాయెల్‌పై రాకెట్‌లతో దాడులు చేస్తుంటారు.అమెరికా ఎప్పటికప్పుడు హూతీలను కంట్రోల్ చేస్తుంటుంది.రెండ్రోజుల క్రితం కూడా అత్యాధునిక బీ2 బాంబర్ల(B2 bombers) ద్వారా హూతీలకు చెందిన అండర్ గ్రౌండ్ ఆయుధాగారాలను ధ్వంసం చేసి హూతీలను చావుదెబ్బ కొట్టింది.
ఈ క్రమంలో ఇరానియన్ చమురును రవాణా చేస్తోన్న హూతీ నెట్‌వర్క్‌తో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఇద్దరు భారతీయులు సహా 18 కంపెనీలపై అమెరికా ప్రభుత్వం ఆంక్షలు విధించింది.వీటిలో మార్షల్ ఐలాండ్స్‌లో రిజిస్టర్ అయిన చాంగ్‌టై షిప్పింగ్ అండ్ మోషన్‌విగేషన్స్ లిమిటెడ్(Changtai Shipping and Motion Navigations Limited), యూఏఈ కేంద్రంగా పనిచేస్తున్న ఇండో గల్ఫ్ షిప్ మేనేజ్‌మెంట్ ఉన్నాయి.ఈ కంపెనీకి రాహుల్ రతన్‌లాల్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు.ఇదే కంపెనీకి టెక్నికల్ మేనేజర్‌గా పనిచేస్తున్న దీపాంకర్ మోహన్ కియోట్‌పైనా అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది.