వరద నీరు పొంగుకొచ్చినా చెక్కుచెదరని ఆలయం... నీటిని దరి చేరనివ్వని ఆలయ కోనేరు!

ఇలాంటి దృశ్యాలు సినిమాలలో చూపిస్తే ఆశ్చర్య పోవడం మీ వంతు అవుతుంది.ఇలా బయట ఎన్నటికీ సాధ్యం కాదు అని మనం మాట్లాడుతూ ఉంటాం.

 Miracle At Kalvabugga Rameswara Temple In Kurnool District Video Viral Details,-TeluguStop.com

అయితే అలాంటి అద్భుతాలు బయట జరిగినప్పుడు, అంతా దైవ మహిమ అని సరిపెట్టుకుంటూ ఉంటాము.మరి కొంతమంది కుహనా మేధావులు మాత్రం అటువంటి అద్భుతాలను కూడా భూతద్దం వేసి మరి చూస్తారు.

ఇప్పుడు అటువంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా ఆంధ్రప్రదేశ్లో( Andhra Pradesh ) కొన్నిచోట్ల వర్షపాతం కారణంగా వరదలు సంభవిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ నేపథ్యంలోనే కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పరిధిలోగల కాల్వబుగ్గ గ్రామంలో( Kalvabugga Village ) చాలా ఆసక్తికరమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది.ఆ దృశ్యం చూసిన జనాలు కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం కాస్త వెలుగు చూసింది.

విషయంలోకెళితే, కాల్వబుగ్గ గ్రామంలో గల ఆలయంలోకి( Kalvabugga Temple ) వరద నీరు పోటెత్తడంతో అంతా ఆ గుడి నీటిలో మునిగిపోతుందేమో అని అనుమానంగా చూడగా ఓ అద్భుతం చోటు చేసుకుంది.

చుట్టుపక్కల వరద నీరు( Flood Water ) ఆలయ ప్రాంగణంలోకి అయితే చేరింది కానీ, ఆలయాన్ని ఆనుకుని ఉన్న కోనేరులోకి మాత్రం ప్రవేశించలేకపోయింది.అక్కడికి తరలివస్తున్న వరద నీటిని, కోనేరులోని మంచినీరు తిరస్కరించింది.వినడానికి చాలా విడ్డూరంగా ఉన్న ఇప్పుడు ఎక్కడ ఉన్నది మాత్రం అక్షర సత్యం అని ఇక్కడ వీడియోని చూస్తే మీకు అనిపించకమానదు! ఇక స్థానికులంతా ఇది సాక్షాత్తు ఆ పరమశివుడు లీల అని మొక్కలు మొక్కుతుండడం మనం గమనించవచ్చు.

దాంతోనే సదరు వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.ఇక ఆలయ గర్భ గుడిలోకి కూడా ఎటువంటి వరద నీరు ప్రవేశించలేదని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube