రోలెక్స్ పాత్ర గురించి షాకింగ్ అప్ డేట్ ఇచ్చిన సూర్య.. అంచనాలు పెంచాడుగా!

తమిళ హీరో సూర్య(Hero suriya) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.హీరో సూర్య ప్రస్తుతం కంగువ(Kangava)సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

 Surya Gave A Shocking Update About The Role Of Rolex. And Raised Expectations!,-TeluguStop.com

ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయ్యింది.ప్రస్తుతం మిగిలిన షూటింగ్ ను పూర్తి చేసే పనిలో పడ్డారు మూవీ మేకర్స్.

నవంబర్ 14న ఈ సినిమా విడుదల కానుంది.శివ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాబి డియోల్ విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

దిశా పటాని ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.

Telugu Kamal Haasan, Kanguva, Kollywood, Rolex Character, Suriya, Suriyarolex-Mo

అయితే ఇప్పటికే రిలీజైన టీజర్ తో పాటు ప్రచార చిత్రాలు ఒక రేంజ్ లో ఉండటంతో కంగువా పై సూర్య అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.ఇప్పటికే చిత్ర నిర్మాత జ్ఞానవేల్ రాజా కంగువా రెండు వేల కోట్ల రూపాయిల వసూళ్ళ ని సాధిస్తుందని కూడా చెప్పాడు.కాగా రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది.

ఈ క్రమంలోనే రీసెంట్ గా ముంబై వేదికగా ఈవెంట్ జరిగింది.ఇందులో పాల్గొన్న సూర్య కంగువా (, suriya, kanguva) తర్వాత తన నుంచి రాబోయే సినిమాల విషయంలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.2022 లో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ (Kamal Haasan)హీరోగా వచ్చిన మూవీ విక్రమ్.

Telugu Kamal Haasan, Kanguva, Kollywood, Rolex Character, Suriya, Suriyarolex-Mo

అన్ని లాంగ్వేజెస్ లో మంచి విజయాన్ని అందుకుంది.ఇందులో రోలెక్స్(Rolex) అనే గ్యాంగ్ స్టార్ పాత్రలో సూర్య కనపడ్డాడు.క్లైమాక్స్ సీన్ లో కొన్ని నిమిషాల పాటే కనపడినా కూడా రోలెక్స్ పాత్రలో సూర్య ప్రదర్శించిన గాంబీర్యం విక్రమ్ విజయ శాతాన్ని కూడా పెంచింది.

లోకేష్ కూడా రోలెక్స్ టైటిల్ తో సూర్యతో మూవీ ఉంటుందని ప్రకటించాడు.ఇప్పుడు ఈ రోలెక్స్ గురించే కంగువా ఈవెంట్ లో సూర్య మాట్లాడుతూ.1986లో విడుదలైన విక్రమ్ మూవీకి ఇప్పటి విక్రమ్ మూవీకి ఎలాంటి సంబంధం ఉందో, రోలెక్స్ సినిమాకి కూడా నా గత సినిమాలతో సంబంధం ఉందని చెప్పారు.దీంతో ఏ మూవీ అయ్యుంటుందని సూర్య అభిమానులు తెగ ఎగ్జైట్ కి లోనవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube