తల్లీదండ్రులు పిల్లల విషయంలో ఎంతో కేర్ తీసుకుంటే మాత్రమే పిల్లలు బాగా చదువుకునే అవకాశం అయితే ఉంటుంది.పిల్లలకు చదువుకు సంబంధించి ఎలాంటి సందేహాలు వచ్చినా ఆ సందేహాలను తీర్చడం తల్లీదండ్రుల బాధ్యత అనే సంగతి తెలిసిందే.
బీహార్ కు( Bihar ) చెందిన శ్రీజ( Sreeja ) అనే విద్యార్థిని బాల్యంలోనే తండ్రి వదిలేసినా టెన్త్ లో టాపర్ గా( Tenth Class Topper ) నిలిచి ప్రశంసలు అందుకున్నారు.
తన సక్సెస్ తో నేటి తరంలో విద్యార్థినులకు, తల్లీదండ్రులు లేని విద్యార్థినులకు ఇన్స్పిరేషన్ గా నిలిచారు.2022 సంవత్సరంలో బీహార్ రాష్ట్రంలో వెలువడిన సీ.బీ.ఎస్.ఈ ఫలితాలలో( CBSE Results ) శ్రీజకు ఏకంగా 99.4 శాతం మార్కులు వచ్చాయి.ఐదేళ్ల వయస్సులోనే తల్లిని కోల్పోయిన శ్రీజ తండ్రి తనను వదిలేసినా కష్టపడి చదివారు.
అమ్మమ్మ, తాతయ్యల సహాయంతో గొప్ప స్థాయికి చేరుకోవడాన్ని శ్రీజ లక్ష్యంగా పెట్టుకున్నారు.
శ్రీజ సాధించిన విజయం అమ్మమ్మ, తాతయ్యలకు కలిగించిన సంతోషం అంతాఇంతా కాదు.శ్రీజ సక్సెస్ ను చూసి ఆమె తండ్రి కచ్చితంగా పశ్చాత్తాపపడతారని శ్రీజ అమ్మమ్మ చెప్పుకొచ్చారు.శ్రీజ సక్సెస్ ను చూసి అప్పటి రాజకీయ నేతలు సైతం ఆ విద్యార్థిని చదువుకు తమ వంతు సహాయ సహకారాలను అందిస్తామని వెల్లడించారు.
నెటిజన్లు సైతం శ్రీజ సక్సెస్ ను ఎంతగానో మెచ్చుకున్నారు.
లైఫ్ లో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో కష్టాలు, ఆటంకాలు ఎదురవుతాయి.వాటిని పట్టించుకోకుండా ముందడుగులు వేస్తే మాత్రమే లక్ష్యాలను సాధించడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు.లక్ష్యాన్ని సాధించే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటమిని మాత్రం అంగీకరించవద్దని శ్రీజ చెబుతున్నారు.
శ్రీజ ప్రతిభను నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.శ్రీజ తర్వాత రోజుల్లో సైతం మంచి మార్కులు సాధించాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఎంతోమంది విద్యార్థులకు శ్రీజ ఇన్స్పిరేషన్ అని చెప్పవచ్చు.శ్రీజ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.