ఐపీఎల్ 18వ సీజన్‌లో( IPL 18 ) భారత కెప్టెన్ రోహిత్ శర్మ( Rohit Sharma ) ఏ జట్టుకు ఆడనున్నాడు? ఇది చాలామందికి మిలియన్ డాలర్ల ప్రశ్న.సీజన్ 17లో కెప్టెన్సీ మార్పుతో నిరాశ చెందిన రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌ను( Mumbai Indians ) వీడనున్నాడని వార్తలు వచ్చాయి.
ఇకపోతే, మెగా వేలంలోకి వెళితే.రోహిత్ ఎక్కువ ధర పలుకుతాడని మాజీ ఆటగాళ్లు కూడా చెబుతున్నారు.
దింతో పరిశీలిస్తే రోహిత్‌కి ఊహించని పరిస్థితి ఎదురైంది.
ఇకపోతే ఈ విషయం సంబంధించి చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్‌తో( New Zealand ) జరుగుతున్న తొలి టెస్టులో ఓ ఘటన చోటుచేసుకుంది.భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో వర్షంతో ఆగిపోయిన సమయంలో కాసేపు ఆట నిలిపివేసినప్పుడు వర్షం కురుస్తుందా.? లేదా? చెక్ చేయడానికి రోహిత్ శర్మ డ్రెస్సింగ్ రూమ్ నుండి బయటకు వచ్చాడు.ఈ సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు( Royal Challengers Bengaluru ) అభిమానులు “మీరు వచ్చే సీజన్‌లో ఏ జట్టు ఆడతారు?” అని అడిగారు.
మొదట, ఒక అభిమాని “రోహిత్, మీరు IPL సీజన్ 18 లో ఏ జట్టు కోసం ఆడతారు?” అని అడిగాడు.దీనిపై భారత కెప్టెన్ రోహిత్ స్పదించలేదు.కాసేపటికే ‘రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు వచ్చేయ్’ అంటూ మరో అభిమాని చెప్పాడు.
హిట్‌మ్యాన్ చిరునవ్వు నవ్వి, “చెప్పండి, మీరు ఏ జట్టు కోసం ఆడాలనుకుంటున్నారో?” అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోయాడు.దీంతో రోహిత్ తన మనసులో ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలని భావించిన అభిమానులకు నిరాశే మిగిలింది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మరి రోహిత్ ఏ టీంలో ఆడాలని మీరు అనుకుంటున్నారో ఓ కామెంట్ చేయండి.