ఇప్పుడు చైనాలో కుక్కలు, పిల్లులకు(dogs ,cats) కూడా ఉద్యోగాలు దొరుకుతున్నాయి.పార్ట్‌టైమ్ వర్క్ చేస్తున్న పెంపుడు జంతువులకు శాలరీలు కూడా ఇస్తున్నారు.
ఆశ్చర్యంగా ఉంది కదూ, వివరాల్లోకి వెళ్తే, ప్రస్తుతం చైనాలో డాగ్, క్యాట్ కేఫ్‌లు చాలా ఫేమస్ అవుతున్నాయి.అంటే, పిల్లులతో ఆడుకోవడానికి, వాటిని చూసి ఎంజాయ్ చేయడానికి ప్రత్యేకంగా కేఫ్‌లు తెరుస్తున్నారు.
ఇలాంటి ఒక కేఫ్ యజమాని సోషల్ మీడియా యాప్‌లో “పిల్లులకు ఉద్యోగాలు” అని ఒక పోస్ట్ పెట్టారు.తనకు “ఆరోగ్యంగా, మంచి స్వభావంతో ఉండే పిల్లులు” పార్ట్‌టైమ్ ఉద్యోగం (Pets doing part-time work)చేయడానికి కావాలి అని అడిగారు.
ప్రతి పిల్లికి రోజుకి ఒక స్నాక్ ఇస్తామని, ఆ పిల్లి యజమాని స్నేహితులకి కేఫ్‌లో 30% డిస్కౌంట్ ఇస్తామని కూడా చెప్పారు.ఈ పోస్ట్ చూసి చాలా మంది పెట్ యజమానులు చాలా ఆసక్తి చూపించారు.
ఈ పోస్ట్‌కి వందలాది లైక్‌లు, కామెంట్లు వచ్చాయి.
కేఫ్‌లలో పిల్లులు, కుక్కలకు పని కల్పించే ఈ కొత్త ట్రెండ్ చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది.చైనాలో పెట్ యానిమల్స్ పనులు చేస్తూ స్నాక్స్ కొనుక్కోవడానికే కాదు వాటి యజమానులకి కొంచెం డబ్బు కూడా సంపాదిస్తున్నాయి.ఇక ఈ కేఫ్‌లకి వెళ్ళాలంటే చిన్న మొత్తంలో ఫీజు చెల్లించాలి.
అంటే, 350 నుంచి 700 రూపాయలు ఇస్తే, ఆ కేఫ్‌లో ఉన్న పిల్లులు, కుక్కలతో(dogs, cats) ఆడుకోవచ్చు.అంతేకాదు, ఆ కేఫ్‌లో ఏదైనా ఫుడ్ కూడా ఆర్డర్ చేస్తే, ఆ జంతువులతో ఇంకా ఎక్కువ సేపు ఆడవచ్చు.
ఇలాంటి కేఫ్‌లు పెంపుడు జంతువుల యజమానులకి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి.ఎందుకంటే, తాము పనికి వెళ్ళినప్పుడు తమ పెంపుడు జంతువులను ఇంట్లో ఒంటరిగా వదిలేయకుండా, ఈ కేఫ్‌లకి తీసుకొచ్చి ఇక్కడ వాటికి ఎంజాయ్ చేసే అవకాశం కల్పిస్తారు.
ఉదాహరణకి, జేన్ ష్యూ అనే యువతికి ఒక సమోయెడ్ కుక్క ఉంది.ఆమె ఈ కేఫ్‌ల గురించి చాలా సంతోషంగా ఉంది.ఎందుకంటే, తాను పనికి వెళ్లినప్పుడు తన కుక్క ఇక్కడ చాలా సంతోషంగా ఉంటుందని ఆమెకి తెలుసు.“నా కుక్కను కేఫ్‌కి పంపడం అంటే, పిల్లలను స్కూల్‌కి పంపడం లాంటిదే.మా కుక్క ఇతర కుక్కలతో ఆడుకుంటుంది, ఒంటరిగా ఉండదు.” అని జేన్ ష్యూ(Jane New) చెప్పింది.ఇలా చేయడం వల్ల వారి ఇంటి ఎయిర్ కండిషనింగ్ బిల్లు కూడా తగ్గుతుంది.బీజింగ్‌లో నివసించే 33 ఏళ్ల ఉపాధ్యాయురాలు షిన్ షిన్ తన రెండేళ్ల వయసు గల బొచ్చు కుక్కకు ఒక ఉద్యోగం వెతుకుతోంది.
ఇంకా ఆమెకు కుక్కల కేఫ్‌లో ఉద్యోగం దొరకలేదు.షిన్ తన కుక్క గురించి చెబుతూ, ఈ కుక్కకు జీతంగా కేవలం “క్యాట్ ఫుడ్ టీన్లు లేదా స్నాక్స్” మాత్రమే కావాలి.“కేఫ్ యజమానులు నన్ను సంప్రదిస్తారని అనుకున్నాను, కానీ ఇప్పుడు నేనే నా కుక్క రెజ్యూమ్ పంపాలి అనిపిస్తోంది” అని ఆమె చెప్పింది.2023 చివరి నాటికి చైనాలో 4,000 కంటే ఎక్కువ క్యాట్ కేఫ్‌లు ఉన్నాయి.ఈ సంవత్సరం ఈ సంఖ్య మరింత పెరిగి ఉంటుంది.