ప్రపంచంలో తల్లిని మించిన గౌరవం, ప్రేమ ఎవరికీ ఉండదు అంతే కాకుండా ప్రతి స్త్రీ కి జీవితంలో అమ్మ అని పిలిపించుకోవాలి అనే కోరుకుంటుంది.అయితే నేటి ప్రపంచంలో ప్రతి మహిళ తనకంటూ ఓ గుర్తింపును వెతుక్కునే ప్రయత్నంలో భాగంగా కొందరు ఉద్యోగాలు, మరి కొందరు సినిమా హీరోయిన్లు విజయం సాధిస్తున్నారు, ఉద్యోగం చేస్తున్న మహిళలు గుర్తింపుతో పాటు కుటుంబ ఏర్పాటు మరియు పిల్లల గురించి ఆలోచించి తగిన సమయంలో సంతానం పొందుతున్నారు.సినిమా హీరోయిన్లు మాత్రమే కెరీర్‌పై దృష్టి సారిస్తే లేటువయసులో సంతానం పొందుతున్నారు,
రాధికా ఆప్టే :(Radhika Apte)

ఈ మరాఠీ బ్యూటీ బ్రిటీష్ సంగీతకారుడు బెనెడిక్ట్ టేలర్‌ను(Benedict Taylor) ప్రేమించి 2012 వివాహం చేసుకున్నారు.ఆతరువాత సినిమాలలో మంచి ఆఫర్స్ రావటంతో తాను మూవీ కెరీర్‌పై దృష్టి సారించింది అయితే కొత్త సినిమా సిస్టర్ మిడ్‌నైట్, లండన్‌లో ప్రీమియర్ షో జరుగుతుండగా రాధికా ఆప్టే(Radhika Apte) కూడా పాల్గొంది, ఈవెంట్ లో బేబీ బంప్ తో కనిపించి ప్రేక్షకులకి షాక్ ఇచ్చింది , వివాహం చేసుకున్న12 ఏళ్లకు అంటే ఈ హాట్ బ్యూటీ తాను 39 ఏళ్లకు తల్లి కాబోతుంది.
దీపికా పడుకోణె :(Deepika Padukone)

దీపిక పదుకొనె 2018లో బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ (Ranveer Singh) ప్రేమ వివాహం చేసుకున్నారు, దీపిక పదుకొనె (Ranveer Singh)మరియు రణ్వీర్ సింగ్ ఇద్దరూ సినిమాలతో బిజీగా గడుపుతు కెరీర్‌పై దృష్టి సారించటంతో పెళ్ళై ఏళ్ళు గడుస్తున్నా ఈ బాలీవుడ్ స్టార్ కపుల్ సంతానం గురించి ఎలాటి శుభవార్త తెలుపలేదు.అయితే 38 ఏళ్ల వయసులో దీపికా పదుకొణె సెప్టెంబర్ నెలలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
యామీ గౌతమ్ :(Yami Gautam)

టాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్(Yami Gautam) ‘ఉరి ది సర్జికల్ స్ట్రైక్’ చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్‌ను(Aditya Dhar) ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జూన్ 2021లో వివాహం చేసుకున్నారు.అయితే 35 ఏళ్ల వయసులో మే నెలలో పండంటి మగబిడ్డకు జన్మనించింది.
ఇలియానా:(Ileana)

టాలీవుడ్ స్టార్ ఇలియానా(Ileana) ఇటీవల ఆగస్టు 1న మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు, అయితే ఇలియానా 37 ఏళ్ల వయసులో మగబిడ్డకు జన్మనించింది.చిన్నారి ఫొటోను instagram షేర్ చేస్తూ అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు