సాధారణంగా డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని చాలామంది హీరోయిన్లు చెబుతూ ఉంటారు.అయితే ఒక యువతి మాత్రం మోడల్ నుంచి ఐపీఎస్( IPS ) అయ్యారు.
ఆష్నా చౌధురి( IPS Aashna Chaudary ) సక్సెస్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది.ఫాలోవర్లను సైతం అంతకంతకూ పెంచుకోవడం ద్వారా ఆమె వార్తల్లో నిలుస్తున్నారు.
డిగ్రీ పూర్తి చేసిన ఆష్నా చౌధురి మొదట కార్పొరేట్ జాబ్ కోసం ట్రై చేశారు.
అయితే ఇంటర్వ్యూ వరకు మాత్రం వెళ్లలేకపోయారు.
ఆ తర్వాత కూడా ఇదే పరిస్థితి ఎదురైంది.అయితే కార్పొరేట్ జాబ్ రాకపోవడంతో ఆమె సివిల్స్ పై( Civils ) దృష్టి పెట్టారు.
అయితే ఆష్నా ఆ విషయం ఇంట్లో చెప్పగా మొదట కుటుంబ సభ్యులు షాక్ అయ్యారట.సోషల్ మీడియాలో సైతం ఆష్నా చౌధురి చురుకుగా ఉండేవారు.
ఆష్నాకు మొదట కొన్ని మోడలింగ్ సంస్థలు ఛాన్స్ ఇచ్చాయి.
అయితే సివిల్స్ నిర్ణయం తీసుకున్న తర్వాత మోడలింగ్ ను( Modeling ) ఆమె పక్కన పెట్టేశారు.రెండో ప్రయత్నంలో సైతం రెండున్నర మార్కులతో ఆమె లక్ష్యాన్ని సాధించడంలో ఫెయిల్ అయ్యారు.2022 సంవత్సరంలో ఆష్నా ఏకంగా 116వ ర్యాంక్ సాధించడం ద్వారా వార్తల్లో నిలిచారు.ఓటమికి ఎప్పుడూ భయపడొద్దని ఆష్నా తెలిపారు.ఓటమికి ఎప్పుడూ భయపడొద్దని ఓటమిని సవాలుగా తీసుకోవాలని ఆష్నా చౌధురి వెల్లడించారు.
పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుని తిరిగి ప్రయత్నిస్తే గెలుపు తప్పక అనుసరిస్తుందని ఆష్నా వెల్లడించారు.ఈ అందమైన ఆఫీసర్ సక్సెస్ స్టోరీ( Success Story ) నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.ఎన్నో వైఫల్యాలను, సవాళ్లను దాటి తన సక్సెస్ తో ఆష్నా చౌధురి ప్రశంసలు అందుకోవడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.ఆష్నా చౌదరి భవిష్యత్తులో మరిన్ని భారీ విజయాలను అందుకుంటే ఫ్యాన్స్ సంతోషానికి అయితే అవధులు ఉండవని చెప్పడంలో సందేహం అయితే అవసరం లేదని చెప్పవచ్చు.