పల్లీలు, బెల్లం కలిపి తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారో తెలుసా?

పల్లీలు, బెల్లం( peanuts , jaggery ).ఆరోగ్యపరంగా ఇవి రెండు విడి విడిగా అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.

 Health Benefits Of Eating Peanuts With Jaggery! Peanuts, Jaggery, Peanuts Health-TeluguStop.com

అలాగే కలిపి తీసుకున్న కూడా బోలెడు హెల్త్ బెనిఫిట్స్ పొందుతారు.పల్లీలకు బెల్లాన్ని జోడించి చిక్కీలు తయారు చేస్తుంటారు.

ఇవి తినడానికి ఎంతో రుచికరంగా ఉంటాయి.అలాగే పల్లీలు మరియు బెల్లం ఒక ఆరోగ్యకరమైన కలయికగా చెప్పవచ్చు.

పల్లీలు మరియు బెల్లం కలిపి తీసుకోవడం వల్ల అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తాన్ని శుద్ధి చేస్తాయి.

ప‌ల్లీల్లో సెలీనియం ఉంటుంది, బెల్లంలో మెగ్నీషియం మరియు ఐరన్ ( Magnesium , Iron )ఉంటాయి.

ఇవి సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో తోడ్పడతాయి.అందువల్ల వివాహం అయిన దంపతులు నిత్యం పల్లీలు, బెల్లం కలిపి తీసుకుంటే త్వరగా సంతానం కలుగుతారు.

అలాగే ఎముక‌ల బ‌ల‌హీన‌త‌తో బాధ‌ప‌డుతున్న వారు ప్ర‌తి రోజు ప‌ల్లీలు, బెల్లం క‌లిపి తీసుకోవాలి.త‌ద్వారా వాటిలో మెండుగా ఉండే కాల్షియం ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

Telugu Benefitspeanuts, Tips, Jaggery, Latest, Peanuts Jaggery-Telugu Health

ప‌ల్లీలు, బెల్లం కలయిక హిమోగ్లోబిన్ స్థాయిలను( Hemoglobin ) మెరుగుపరచడంలో మరియు రక్తహీనత స‌మ‌స్య‌ను త‌రిమి కొట్ట‌డంతో అద్భుతంగా హెల్ప్ చేస్తుంది.అలాగే ప‌ల్లీల్లో జింక్, సెలీనియం ఉంటాయి.బెల్లంలో విట‌మిన్ సి ఉంటుంది.ఇవి రోగనిరోధక వ్యవస్థ కు మద్దతు ఇస్తాయి.ప‌ల్లీలు, బెల్లం క‌లిపి తీసుకుంటే నీర‌సం, బ‌ల‌హీన‌త దూరం అవుతాయి.ప‌ల్లీల్లోని ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు ప్రోటీన్లు స్థిరమైన శక్తిని అందిస్తాయి.

బెల్లం లోని సహజ చక్కెరలు శీఘ్ర శక్తిని అందిస్తాయి.

Telugu Benefitspeanuts, Tips, Jaggery, Latest, Peanuts Jaggery-Telugu Health

ప‌ల్లీలు, బెల్లం కాంబినేష‌న్ చ‌ర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా స‌హాయ‌ప‌డుతుంది.బెల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది.ఇవి వివిధ చ‌ర్మ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెడ‌తాయి.

ప‌ల్లీల్లో ఉండే విట‌మిన్లు, ఖ‌నిజాలు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి.ఇక ప‌ల్లీలు మ‌రియు బెల్లం క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణక్రియ సైతం చురుగ్గా ప‌ని చేస్తుంది.

మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య ఉంటే దూరం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube