నాయుడుగారి తాలూకా అంటున్న నాని... కొత్త సినిమా టైటిల్ ఇదేనా?

నాచురల్ స్టార్ నాని( Nani ) ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీ అవుతున్నారు.వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా ఉన్న ఈయన ఇటీవల సరిపోదా శనివారం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు.

 Nani Sreekanth Odela Movie Title Details, Nani,sreekanth Odela,naidugari Thaluka-TeluguStop.com

ఇక ఈ సినిమా తర్వాత నాని తన తదుపరి ప్రాజెక్టు పనులు బిజీగా ఉన్నారు.నాని ఇటీవల శ్రీకాంత్ ఓదెల( Sreekanth Odela ) దర్శకత్వంలో దసరా సినిమా చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఈ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు అయితే మరోసారి శ్రీకాంత్ డైరెక్షన్ లో నాని నటించబోతున్నారు.

Telugu Dasara, Srikanth Odela, Gari Thalukaa, Nani, Nani Odela, Shraddha Kapoor,

ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సినిమా కోసం విభిన్నమైన టైటిల్ ఎంపిక చేశారని తెలుస్తుంది.ఈ సినిమా కోసం నాయుడుగారి తాలూకా( Naidugari Talukaa ) అనే టైటిల్ పరిశీలనలో ఉంచినట్టు తెలుస్తుంది.

అయితే త్వరలోనే ఈ సినిమా టైటిల్ కి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాబోతుందని తెలుస్తుంది.ఇక ఈ సినిమా అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కానున్నాయి.

ఈ సినిమాలో నాని సరసన బాలీవుడ్ బ్యూటి శ్రద్ధా కపూర్( Shraddha Kapoor ) హీరోయిన్ గా నటిస్తున్నారు.

Telugu Dasara, Srikanth Odela, Gari Thalukaa, Nani, Nani Odela, Shraddha Kapoor,

ఇక ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ సంగీతమందించబోతున్నారని తెలుస్తుంది.ఇక ఈ సినిమాతో పాటు ఈయన జబర్దస్త్ కమెడియన్ వేణు డైరెక్షన్లో రాబోతున్న ఎల్లమ్మ సినిమాలో కూడా నటించబోతున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి కానీ కొన్ని కారణాల వల్ల నాని ఈ సినిమాను రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి నాని కూడా టైర్ 2 హీరోలలో స్టార్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube