రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కోడలు రాధికా మర్చంట్( Radhika Merchant ) బుధవారం నాడు తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.ముంబైలో జరిగిన ఈ పుట్టినరోజు( Radhika Merchant Birthday ) వేడుకకు సినీ, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
అనంత్ అంబానీతో( Anant Ambani ) పెళ్లి తర్వాత రాధికా మర్చంట్‌కి ఇదే మొదటి పుట్టినరోజు.ఈ సమయంలో ముకేశ్ అంబానీ, నీతా అంబానీ కుటుంబ సభ్యులు హాజరై పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
పుట్టినరోజు వేడుకల్లో రాధిక మర్చంట్ తల్లిదండ్రులు వీరేన్, షీలా మర్చంట్ కూడా పాల్గొన్నారు.రాధిక మర్చంట్ కేక్ కట్ చేసి ముందుగా తన భర్త అనంత్ అంబానీకి అందించింది.
ఆ తర్వాత దానిని ముఖేష్ అంబానీకి( Mukesh Ambani ) కేక్ తినిపించింది.అనంతరం కుటుంబ సభ్యులకు కేక్‌ను తినిపించింది.ఇక పుట్టిన రోజును పునస్కరించుకొని కుటుంబ సభ్యులు, ముఖ్య అతిధులు రాధిక మర్చంట్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ బర్త్‌డే పార్టీకి బాలీవుడ్ స్టార్స్ రణవీర్ సింగ్, అర్జున్ కపూర్, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ తదితరులు హాజరయ్యారు.
బాలీవుడ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఓరీ సంబంధిత వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసాడు.ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఫార్మాస్యూటికల్ దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీని జూలై 2024లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.వీరి వివాహ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారవేత్తలు, ప్రముఖ సినీ, క్రీడా ప్రముఖులు హాజరైన సంగతి తెలిసిందే.