రోజుకి ఎన్ని కప్పుల గ్రీన్ టీ త్రాగితే మంచిదో తెలుసా?

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం మీద శ్రద్ద పెరిగి గ్రీన్ టీ త్రాగే వారి సంఖ్య కూడా చాలా పెరిగిపోయింది.ఎందుకంటే ప్రపంచంలోనే ఆరోగ్యకరమైన టీగా పేరు పొందింది.

 How Many Cups Of Green Tea We Can Drink Per Day-TeluguStop.com

దీనికి కారణం గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటమే.ఈ యాంటీ ఆక్సిడెంట్లు అనేక వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తాయి.

అందుకే ప్రతి ఒక్కరు గ్రీన్ టీని త్రాగటం అలవాటు చేసుకున్నారు.

అయితే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా గ్రీన్ టీని రోజుకి ఎన్ని కప్పులు త్రాగాలో మీకు తెలుసా? ఏదైనా ఎక్కువ త్రాగితే అనర్ధమే కదా? ఒకవేళ మోతాదు మించితే అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.అందువల్ల ఇప్పుడు రోజులో ఎన్ని కప్పుల గ్రీన్ టీ త్రాగాలో వివరంగా తెలుసుకుందాం.

గ్రీన్ టీ త్రాగటం వలన మన శరీరానికి పాలిఫినాల్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి.అవి రోజుకి మన శరీరానికి 320 మిల్లీగ్రాముల మోతాదు సరిపోతుంది.అలాగే గ్రీన్ టీ లో కెఫీన్ కూడా ఉంటుంది.

ఒక కప్పు గ్రీన్ టీ త్రాగితే 25 మిల్లీగ్రాముల కెఫీన్ మన శరీరానికి అందుతుంది.

పాలిఫినాల్స్, కెఫీన్ ఈ రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటే రెండూ తగినంత మోతాదులోనే మన శరీరానికి లభించాలంటే.

సుమారుగా మూడు కప్పుల వరకు గ్రీన్ టీని మనం రోజూ తాగవచ్చు.అంతకు మించి త్రాగితే ప్రమాదమే.

అయితే ముఖ్య విషయం ఏమిటంటే రోజుకి మూడు కప్పుల గ్రీన్ టీని త్రాగాలని అనుకొనే వారు కాఫీ,టీలను త్రాగటం తగ్గించాలి.ఎందుకంటే వాటిలో కూడా కెఫీన్ ఉంటుంది.

కాబట్టి మోతాదు మించకుండా చూస్కొని గ్రీన్ టీ త్రాగాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube