శరీరంలో విటమిన్ డి లోపం వల్ల కలిగే లక్షణాలు....

మానవ శరీరంలో విటమిన్ డి లోపిస్తే మనకు తెలియకుండానే చాలా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.విటమిన్ డి లోపాన్ని గుర్తించడం చాలా కష్టమైన విషయమే.

 These Are The Symptoms For Vitamin D Deficiency Details, Vitamin D Deficiency, V-TeluguStop.com

మన శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా విటమిన్ డి లోపమే.విటమిన్-డి లోపం వల్ల మనకి తెలియకుండా మన ఆరోగ్యం దెబ్బ తింటుంది.

దీన్ని గుర్తించాలంటే చాలా కష్టమే.కానీ మనం కొన్ని రకాల డి విటమిన్ లక్షణాలను గుర్తించవచ్చు.

కానీ కష్టం కాబట్టి ఒకవేళ మీకు ఎక్కువ సందేహం కలిగి ఉంటే డాక్టర్ ని కన్సల్ట్ చేయడం మంచిది.కొన్ని రకాల లక్షణాల ద్వారా మనకి విటమిన్ డి లోపం ఉందే లేదో తెలుసుకోవచ్చు.

ఒక్కోసారి మంచిగా ఉన్నా నీరసంగా ఉండటం, ఎముకల నొప్పి, మజిల్ వీక్నెస్, మజిల్ పెయిన్స్, డిప్రెషన్, తలనొప్పి, మితి మీరిన కోపం ఇటువంటి లక్షణాల ద్వారా విటమిన్ డి లోపం ఉండే అవకాశం ఉంది.పిల్లల్లో ఐతే రికెట్స్ సమస్య వస్తుంది.

దీంతో వాళ్ళ యొక్క ఎదుగుదల పూర్తిగా తగ్గిపోతుంది.మజిల్ వీక్నెస్, ఎముకల నొప్పులు ఇలా పలు రకాల సమస్యలు విటమిన్-డి లోపం వల్ల కలుగుతాయి.

విటమిన్ డి ఫ్యాటి చేపల్లో విటమిన్ డి ఎక్కువుగా ఉంటుంది.సాల్మన్, కాడ్ మరియు ట్యూనా వంటి చేపలను మీరు ఆహారంలో తీసుకున్నా మీకు విటమిన్ డి లభిస్తుంది.

Telugu Healht, Tips, Muscel Weakness, Mushrooms, Sun Rays, Vitamin Foods-Telugu

మనం రోజూ తీసుకునే గుడ్లలో కూడా విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది.అలాగే ఒక టేబుల్ స్పూన్ కాడ్ లివర్ ఆయిల్లో 1,300 IU విటమిన్ డి ఉంటుంది.శాఖాహారులైతే పాలు తీసుకుంటే చాలు.పుట్టగొడుగుల్లో కూడా విటమిన్ డి ఎక్కువగానే ఉంటుంది.ఇంకా చెప్పాలంటే నారింజలో కూడా ఎక్కువ విటమిన్ డి మనకి లభిస్తుంది.ఉదయం వేళలో సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు వచ్చే ఎండలో కూడా సహజసిద్ధమైన విటమిన్ డి మన శరీరానికి లభిస్తుంది.

ఇలాంటి సహజ సిద్ధమైన విటమిన్ డి మన శరీరానికి అందాలంటే ఉదయం కాసేపు ఎండలో ఉంటే సరిపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube