నాగార్జున కెరియర్ ను నిలబెట్టిన టాప్ 5 సినిమాలు ఇవే !

అక్కినేని వంశ వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు నాగార్జున.చాలామంది తండ్రుల వారసత్వాన్ని ఆసరాగా చేసుకుని ఇండస్ట్రీకి వచ్చి అడ్రస్ లేకుండా గల్లంతయిన వారు ఉండగా తండ్రి పేరును కాపాడుతూ ఆయన ఇచ్చిన అన్నపూర్ణ స్టూడియోను కూడా ఎంతో బాగా డెవలప్ చేయడంతో పాటు నాగార్జున కెరియర్ను కూడా చాలా లాంగ్ లాస్టింగ్ కెరియర్ గా మలుచుకోగలిగాడు.

 Top 5 Movies Of Hero Nagarjuna ,nagarjuna , Sri Ramadasu, Shiva Movie ,annamayy-TeluguStop.com

ఆయన లాగా మళ్లీ నాగార్జున కొడుకులు ఆ స్థాయిని అందుకోలేకపోతున్నారు ఇది అందరికీ తెలిసిన విషయమే.అయితే నాగార్జునను ఒక స్టార్ హీరోగా నిలబెట్టిన ఐదు సినిమాల గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

శివ

Telugu Amala, Annamayya, Nagarjuna, Shiva, Sri Ramadasu, Tollywood-Movie

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ సినిమా( Siva ) లేకపోతే దాదాపు నాగార్జున కెరియర్ ఈరోజు ఈ స్థాయిలో ఉండేది కాదు.ఆయనకు కెరియర్ లో స్టార్ హీరో అని అందరూ అనిపించుకునేలా చేసిన సినిమా శివ.సినిమా ఇండస్ట్రీలోనే శివ సినిమాకి ముందులాగ ఒకటి శివా సినిమా తర్వాత మరోలా మారిపోయింది.సినిమా పరిశ్రమ ఈ చిత్రం తర్వాతే చాలామంది మాస్ సినిమాలు చేయడానికి నాగార్జున సరిపోతాడు అని అనుకున్నారు.అప్పటి వరకు కేవలం రొమాంటిక్స్ సినిమాలతో మాత్రమే మెప్పించిన నాగార్జున ఆ తర్వాత ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు.

నిన్నే పెళ్ళాడుతా

Telugu Amala, Annamayya, Nagarjuna, Shiva, Sri Ramadasu, Tollywood-Movie

నాగార్జున మోస్ట్ రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిన్నే పెళ్ళాడుతా ( Ninne Pelladatha )మరొక మైల్ స్టోన్ సినిమా గా చెప్పుకోవచ్చు.ఒక కొడుకుగా అల్లరి అలాగే లవర్ గా ప్రేమ ఫ్యామిలీ మెన్ గా అన్ని రకాలుగా ఈ సినిమాలో మెప్పించాడు నాగార్జున.

అన్నమయ్య

రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నాగార్జున చాలా కష్టం మీద నటించాడు కానీ ఆయన కష్టం వృధా కాలేదు.నిన్నే పెళ్ళాడుతా వంటి మోస్ట్ రొమాంటిక్ సినిమా తర్వాత వచ్చిన అన్నమయ్య ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది.

శ్రీరామదాసు

Telugu Amala, Annamayya, Nagarjuna, Shiva, Sri Ramadasu, Tollywood-Movie

నాగార్జున కెరియర్ కాస్త డల్ అయిన సందర్భంలో వచ్చిన శ్రీరామదాసు( Sri Ramadasu ) మళ్లీ నాగార్జునను తిరిగి నిలబెట్టింది.ఈ సినిమా కూడా రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే వచ్చింది.

సోగ్గాడే చిన్నినాయన

కెరియర్ ఆల్మోస్ట్ అయిపోతుంది అనుకున్న సందర్భంలో నాగార్జునను మళ్ళీ తిరిగి నిలబెట్టిన చిత్రం సోగ్గాడే చిన్నినాయన.ఈ సినిమా తర్వాత మళ్లీ నాగార్జున కెరియర్ ఊపందుకుంది.దీనికి సీక్వల్ గా వచ్చిన చిత్రం కూడా మంచి విజయం సాధించడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube