సాధారణంగా సినీ, టీవీ నటులు, యాంకర్లపై కొంతమంది చాలా అభిమానం పెంచుకుంటారు.వారిని కలవాలని, వారితో ఫోటోలు దిగాలని, వారి ఇంటికి వెళ్లి కాసేపు సమయం గడపాలని కూడా కలలు కంటారు.
అయితే 37 ఏళ్ల గావిన్ ప్లంబ్ అనే వ్యక్తి అభిమానం మాత్రం పీక్ స్టేజ్ కి చేరుకుంది.అతడు పాపులర్ బ్రిటిష్ టీవీ సెలబ్రిటీ హాలీ విల్లోబీని కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి, హత్య చేయాలని కుట్ర పన్నాడు.
ఈ ఆరోపణలతో అతడిని అరెస్టు కూడా చేశారు.చెల్మ్స్‌ఫోర్డ్ క్రౌన్ కోర్టులో( Chelmsford Crown Court ) జరిగిన విచారణలో గావిన్ ఈ ప్లాన్ చేసినట్లు వెళ్లడైంది.
గావిన్ ఒక షాపింగ్ మాల్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు.టీవీ ప్రెసెంటర్ హాలీ విల్లోబీని ( Holly Willoughby )కిడ్నాప్ చేయడానికి ఒక వివరణాత్మక ప్రణాళికను రూపొందించాడని అతనిపై ఆరోపణలు ఉన్నాయి.
అతను “కిడ్నాప్, రిస్ట్రైంట్ కిట్”ను కూడా సేకరించాడని, ఈ నేరాన్ని చేయడానికి సహాయం చేయడానికి మరొక వ్యక్తిని యూఎస్ నుంచి యూకేకు రావాలని ఆన్‌లైన్‌లో ప్రోత్సహించాడని తెలుస్తోంది.విచారణ సమయంలో, గావిన్ హాలీ విల్లోబీని కిడ్నాప్ చేసి బంధించడం తన కల అని అంగీకరించినట్లు తెలుస్తోంది.
అయితే, అతను అన్ని ఆరోపణలను ఖండించాడు.గావిన్ ప్లాన్లు కేవలం ఒక పిచ్చివాడి కలలు కాదని, చాలా జాగ్రత్తగా రూపొందించబడ్డాయని ప్రాసిక్యూటర్ వాదించారు.
కాలక్రమేణా, హాలీ విల్లోబీపై గావిన్ ప్లంబ్‌కు పిచ్చి పెరిగిపోయిందని, ఆమెను ఇంటి నుంచి కిడ్నాప్ చేసి, ఎక్కడికో తీసుకెళ్లి, అనేక సార్లు అత్యాచారం చేసి చివరకు చంపేయాలని అతడు నిజంగానే అనుకుంటున్నాడని తెలిపారు.

గావిన్ ఆన్‌లైన్‌లో మాట్లాడుతున్న యునైటెడ్ స్టేట్స్ రహస్య పోలీస్ అధికారితో( United States Secret Police officer ) తన ప్లాన్‌లను పంచుకున్న తర్వాత అతనిని అరెస్టు చేశారు.కేవలం ఊహించడం ఇక సరిపోదని, తన కలను నిజం చేయాలని అనుకుంటున్నానని గావిన్ ఆ అధికారితో చెప్పాడని తెలుస్తోంది.రిపోర్ట్ల ప్రకారం, గావిన్ ఆన్‌లైన్‌లో హెవీ డ్యూటీ మెటల్ వైరు టైలను కొనుగోలు చేశాడు.2023 మార్చిలో మార్క్ అనే వ్యక్తికి వాయిస్ మెయిల్‌లో, ట్రాఫిక్‌ను నివారించడానికి రాత్రివేళల్లో కిడ్నాప్ చేయాలనే తన ప్లాన్ గురించి వివరించాడు.విల్లోబీ, ఆమె భర్తను మత్తులో పడేలా చేయడానికి క్లోరోఫార్మ్ ఉపయోగించాలని గావిన్ ప్లాన్ చేశాడని తెలుస్తోంది.

2023 అక్టోబర్‌లో డేవిడ్ నెల్సన్ ( David Nelson )అనే వ్యక్తితో జరిగిన ఆన్‌లైన్ సంభాషణలో, విల్లోబీ కోసం అతను రూపొందించిన వికృతమైన, లైంగిక కోరికలతో కూడిన ప్లాన్‌లను గావిన్ వెల్లడించాడు.ఈ సంభాషణ సమయంలో, వివిధ లైంగిక పరికరాల కిట్‌ను చూపించే వీడియోను గావిన్ పంచుకున్నాడు.గావిన్ మాట్లాడుతున్న వ్యక్తి నిజానికి సీక్రెట్ పోలీస్ ఆఫీసర్ అని, నేరం జరగకుండా చివరికి ఆ అధికారి జోక్యం చేసుకున్నాడని అతనికి తెలియదు.గావిన్ ఫోన్‌లో “హాలీ” అనే ఫోల్డర్ ఉందని, అందులో 10,000 కంటే ఎక్కువ విల్లోబీ ఫోటోలు ఉన్నాయని, వాటిలో చాలా వరకు అశ్లీల డీప్‌ఫేక్‌లు ఉన్నాయని మోర్గాన్ చెప్పారు.
ఈ కేసు విచారణ దాదాపు రెండు వారాల పాటు జరగనుంది.