వైరల్: రోడ్డుపై కారును పరుగులుపెట్టిస్తున్న మాజీ సీఎం..

డిసెంబర్ 8 2023 తేదీన అర్ధరాత్రి సమయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్( KCR ) కాలుజారి ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో పడిపోయిన సంగతి అందరికీ వివిధమే.ఈ నేపథ్యంలో ఆయనను కుటుంబ సభ్యులు చంద్రశేఖర రావును సోమాజిగూడ లోని యశోద ఆసుపత్రికి చేర్పించి చికిత్సను అందించారు.

 Kcr Drives Omni Van In His Farm House Viral Details, Kcr, Telangna Ex Cm Kcr, Re-TeluguStop.com

అక్కడ పరీక్షలు చేసిన తర్వాత పక్కటి ఎముక విరిగిందని డాక్టర్లు నిర్ధారించారు.దాంతో డిసెంబర్ 9న కేసీఆర్ కు తుంటి ఎముక ఆపరేషన్ చేశారు.

ఆ శస్త్ర చికిత్స విజయం అనంతరం వైద్యుల సూచన మేరకు తనకు కేటాయించిన గదిలో రైతుల పర్యవేక్షణలో వాకర్ సహాయంతో మెల్లగా అడుగులు వేసిన వీడియోలు బిఆర్ఎస్( BRS ) సోషల్ మీడియా ఖాతా ద్వారా విడుదల చేశారు.

ఆ సమయంలో కేసీఆర్ ను కలిసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,( CM Revanth Reddy ) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి లాంటి అనేకమంది ప్రముఖులు కూడా వెళ్లి ఆయన పలకరించారు.ఆ తర్వాత నాలుగు రోజులపాటు ఆసుపత్రిలోనే చికిత్స అనంతరం ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఆయన డిసెంబర్ 13న డిశ్చార్జి జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి వెళ్లారు.అలా కొద్ది రోజుల తర్వాత చేతి కర్ర సహాయంతో కేసీఆర్ నడవడం మొదలుపెట్టారు.

లోక్సభ ఎన్నికల సమయంలో కూడా కర్ర పట్టుకుని పార్టీ కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు.ఇకపోతే తాజాగా రెండు రోజుల క్రితం బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మాజీ సీఎం సమావేశం అయ్యారు.అయితే ఈ నేపథ్యంలో ఆయన కాలి ఆరోగ్యం ఇంకా మెరుగుపడటానికి మాన్యువల్ కారు నడవాలని ఆయనకు డాక్టర్లు సూచించినట్లు సమాచారం.దీంతో ఆయన తన పాత ఓమ్ని వ్యానును( Omni Van ) కేసీఆర్ గురువారం నాడు నడిపారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube