నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్( Prabhas ) హీరోగా నటించిన తాజా చిత్రం కల్కి.( Kalki ) తాజాగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతోంది.
ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఈ సినిమా గురించి వార్తలు వినిపిస్తున్నాయి.సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా గురించి చర్చించుకుంటున్నారు.
ముఖ్యంగా ఈ మూవీలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సీన్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు.నాగ్ అశ్విన్ అదిరిపోయే రేంజ్ లో సినిమా తీశారని అంటున్నారు.
అలాగే కల్కి సినిమా విడుదల అయిన మొదటి రోజే 191 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అదరగొట్టింది.
రెండు రోజుల్లో 298.5 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరి కొత్త రికార్డును సృష్టించింది.ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
ఇకపోతే ఆ సంగతి పక్కన పెడితే.కల్కి సినిమాకు పార్ట్ 2 ఉందని, కల్కి సినిమాటిక్ యూనివర్స్ కూడా ప్రకటించి వాటిల్లో మరిన్ని సినిమాలు ఉండొచ్చని కల్కి సినిమా క్లైమాక్స్ లో చెప్పిన విషయం తెలిసిందే.
అలాగే కల్కి సినిమా క్లైమాక్స్ లో అదిరిపోయే ట్విస్ట్ ఇవ్వడంతో ప్రేక్షకులు పార్ట్ 2( Kalki 2 ) కోసం ఎదురుచూస్తున్నారు.అయితే ఇటీవల ప్రభాస్, నాగ్ అశ్విన్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్ లో కల్కి పార్ట్ 2 వర్క్ మరో 10 రోజుల్లో మొదలవుతుందని తెలపడంతో అభిమానుల ఆశలు కాస్త మరింత పెరిగాయి.
దానికి తోడు తాజాగా నిర్మాత అశ్వినీదత్( Ashwini Dutt ) మీడియా రిపోర్టర్స్ తో మాట్లాడుతూ చేసిన వాఖ్యలు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.ఈ సందర్బంగా కల్కి పార్ట్ 2 గురించి నిర్మాత అశ్వినీదత్ మాట్లాడుతూ.ఇప్పటికే కల్కి పార్ట్ 2 సినిమా 60 శాతం షూటింగ్ పూర్తి అయింది.త్వరలోనే మిగిలిన షూటింగ్ మొదలుపెడతాము.షూట్ అయ్యాకే రిలీజ్ డేట్ గురించి ఆలోచిస్తాము.పార్ట్ 3 గురించి ఇంకా ఆలోచించలేదు అని తెలిపారు.
దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అందరూ పార్ట్ 2 కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే 60 శాతం షూటింగ్ అయిపోయిందని నిర్మాత అశ్వినీదత్ చెప్పడంతో కల్కి పార్ట్ 2 సినిమా వచ్చే సంవత్సరమే రిలీజ్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు.కల్కి సినిమా సక్సెస్ అవడంతో బోలెడంత ఆనందంగా ఉన్న అభిమానులకు అశ్విని దత్ వాఖ్యలు మరింత ఆనందాన్ని ఇచ్చాయి.