రికార్డులు సాధించడం అంత సులభమైన పనేం కాదు.ఇవి క్రియేట్ చేయడానికి ప్రజలు చేసే కొన్ని ఘనతలు అందరికీ తెలిసే ఉంటాయి.
ఉదాహరణకు జుట్టుతో పెద్ద వాహనాలను లాగడం, గట్టి వస్తువులను పగలగొట్టుకోవడం.మరికొన్ని మాత్రం చాలా విచిత్రంగా, అసాధారణంగా ఉంటాయి.
జర్మనీకి( Germany ) చెందిన ఆండ్రే ఓర్టోల్ఫ్( Andre Ortolf ) అనే వ్యక్తి ఇలాంటి ఓ అసాధారణ రికార్డు సృష్టించాడు.అతను తన దంతాలతో ఏకంగా నిమిషంలో 44 వాల్నట్స్ పగులగొట్టాడు! అంతేకాకుండా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (GWR)లో కూడా చోటు దక్కించుకున్నాడు.
GWR వారు ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఘనతను చూపించే ఓ వీడియో షేర్ చేశారు.
ఆ వీడియోలో ఓర్టోల్ఫ్ తన దంతాలతో వాల్నట్స్( Walnuts ) ఎలా పగులగొడతాడో చూపిస్తున్నాడు.వీడియో క్యాప్షన్‌లో రికార్డుని నిర్థారించారు.“నిమిషంలో దంతాలతో అత్యధిక గింజలను పగలగొట్టిన వ్యక్తి – 44 – ఆండ్రే ఓర్టోల్ఫ్.” అని క్యాప్షన్‌లో రాశారు.ఈ వీడియో చూసిన వారి నుండి చాలా రకాల రియాక్షన్లు వచ్చాయి.
ఒక వ్యక్తి జోక్‌గా, సినిమాల్లో జాంబీస్ లాంటి వాటిని కొరికేందుకు ఓర్టోల్ఫ్ పనికి వస్తారని అన్నారు.అంటే అతని దంతాలు చాలా బలంగా ఉంటాయని కామెంట్ చేశారు.
ఇలాంటి విచిత్రమైన పని వల్ల 30 ఏళ్ల వయసుకే ఓర్టోల్ఫ్కు పళ్ళు పెట్టించుకోవాల్సి వస్తుందేమో అని మరొకరు వ్యాఖ్యానించారు.
ఈ వీడియో షేర్ చేసిన వెంటనే వైరల్ అయింది.ఇన్‌స్టాగ్రామ్‌లో 252,000 మంది ఈ వీడియోను చూశారు.ఆసక్తికరంగా, ఆండ్రే మాత్రమే గింజలను ఉపయోగించి రికార్డులు సృష్టించలేదు.2023లో, భారతదేశానికి చెందిన నవీన్ కుమార్( Naveen Kumar ) అనే ఒక మార్షల్ ఆర్టిస్ట్ కూడా ఇలాంటి ఘనత సాధించాడు.అతను తన తలతో ఒక నిమిషంలోనే 273 గింజలను పగులగొట్టాడు.
ఈ రకమైన అసాధారణ రికార్డులు మానవ సామర్థ్యాల పరిమితులను ఎలా దాటివేస్తారో చూపిస్తాయి.పళ్ళతోనైనా, తలతోనైనా, ఈ రికార్డు సృష్టించిన వ్యక్తులు తమ అద్భుతమైన అంకితభావం, ప్రత్యేకమైన ప్రతిభలను చాటుకున్నారు.
దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.