కల్కి సినిమా ( Kalki movie )విడుదలైన తర్వాత చాలామంది ఈ సినిమాలో క్యామియో పాత్రలో నటించిన విజయ్ దేవరకొండ( vijay devarakonda ) గురించి నెగటివ్ గా మాట్లాడుతున్నారు.ఈ సినిమాలో అనవసరమైన క్యామియోలు( Cameos ) చాలానే ఉన్నాయి కానీ విజయ్ ఏదో ఈ సినిమాకి నష్టం చేశాడు అనే విధంగా మాట్లాడటమే అస్సలు బాగాలేదు.
ఏదైనా కొద్దిస్థాయి వరకు ఉంటే పర్వాలేదు కానీ చేసిన ప్రతి పని తప్పు అంటే అది ఏదో ఒక రోజు మరో యాంగిల్ కి మారిపోతుంది.ఆయన నటించిన సినిమాల విషయానికొస్తే కూడా విడుదలైన మొదటి షో కన్నా ముందే సినిమా బాగాలేదు అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన విషాన్ని చిమ్ముతూ ఉంటారు.
సినిమా బాగా లేకపోతే ఎటు వచ్చి ప్లాప్ అవుతుంది దానికి అనవసరమైన రాద్ధాంతం చేయడానికి చూస్తే మాత్రం కొంతమందికి విసుగు పుడుతుంది.
నిజానికి కల్కి సినిమాలో క్యామియో చేయాలని నాగ్ అశ్విన్( Nag Ashwin ) విజయ్ దేవరకొండను అడిగాడు.అంతేకాదు ఆయన తీసే ప్రతి సినిమాలో కూడా విజయ్ ఉంటాడు అనే స్టేట్మెంట్ కూడా నాగి ఇచ్చేశాడు.హీరోగా నైనా చేస్తాడు లేదంటే ఏదైనా క్యామ్యో చేస్తాడు లేదంటే మరో పాత్రైనా చేస్తాడు కానీ విజయ్ దేవరకొండ లేకుండా నా సినిమా ఉండదు అంటూ నాకు ఇటీవల ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా తెలియజేశారు.
మరి అలాంటి ఒక గొప్ప డైరెక్టర్ విజయ్ ని ఏది కోరి కావాలనుకుంటే ఆపడానికి మనమెవరం.పట్టి పట్టి ప్రతి విషయాన్ని నెగటివ్ చేయాల్సిన అవసరం కూడా లేదు తను చేసిన తప్పేమీ లేదు ఇంత హేట్ చేయడం వల్ల విజయ్ దేవరకొండకు వచ్చిన నష్టమేమీ లేదు.
ఎవరు అవునన్నా కాదన్నా టాలీవుడ్( Tollywood ) ఫిలిం ఇండస్ట్రీలో తన స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు.అతి తక్కువ సమయంలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న అతి కొద్ది మందిలో విజయ్ దేవరకొండ ముందు వరుసలో ఉంటారు.ఖచ్చితంగా మరి కొద్ది రోజుల్లో ఆయన ప్యాన్ ఇండియా సినిమా చేసి ఒక వెలుగు వెలుగుతారు.దీన్ని కాదు అనే హక్కు గాని ఎవరికి లేదు.పైగా చాలామంది బ్యాగ్రౌండ్ ఉండి టాలీవుడ్ లో ఏళ్లకు ఏళ్లు హిట్టు లేకుండా సరైన యాక్టింగ్ తెలియకుండా కథ ఎలా ఎంచుకోవాలో క్లారిటీ లేని హీరోస్ చాలానే ఉన్నారు.ఒక్కో ఫ్యామిలీ నుంచి డజన్ల కొద్ది హీరోలు వస్తూ ఏమి పీకలేకపోతున్న వారిని చూస్తూ కూడా విజయ్ దేవరకొండను కామెంట్ చేస్తున్న వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే టాలెంట్ ని ఎవరు తొక్కి పెట్టలేరు.